News October 22, 2025
ఖమ్మం: ఆ మండలాలకు కేంద్రం రూ.కోటి నజరానా

ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా అధిక సోలార్ ప్లాంట్‌లు కలిగిన గ్రామాలను మోడల్ గ్రామాలుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఖమ్మం నుంచి 8, భద్రాద్రి జిల్లా నుంచి 14 గ్రామాలు అర్హత సాధించాయి. చివరికి ఉమ్మడి ఖమ్మం నుంచి కొనిజర్ల, భద్రాచలం అధిక మొత్తంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తితో ముందు భాగాన నిలిచాయి. దీంతో ఆ రెండు మండలాలకు కోటి చొప్పున నజరానాను కేంద్ర ప్రభుత్వం అందజేయనుంది.
Similar News
News October 22, 2025
వరంగల్: ఆకతాయిలు వేధిస్తే సమాచారం ఇవ్వండి!

మహిళలు, విద్యార్థినులను ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీ టీం పోలీసులకు సమాచారం ఇవ్వాలని షీ టీం ఇన్‌స్పెక్టర్ సుజాత కోరారు. సుబేదారిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డయల్ 100, సైబర్ క్రైమ్, టీసేవ్ యాప్‌తో పాటు షీ టీం సేవలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. వేధింపులు ఎదురైతే మౌనంగా ఉండొద్దని, 8712685142కు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు.
News October 22, 2025
నాగులచవితికి విశాఖ జూ పార్కు వేళల్లో మార్పు!

నాగులచవితి పండగ సందర్భంగా విశాఖలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ వేళల్లో మార్పులు చేశారు. శనివారం రోజు సందర్శకుల కోసం పార్కును సాధారణ సమయం కంటే ముందుగా ఉదయం 7:30 గంటలకే తెరవనున్నట్లు క్యూరేటర్ మంగమ్మ ప్రకటించారు. జూ లోపల పటాకులు, పేలుడు పదార్థాలు వంటి నిషేధిత వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News October 22, 2025
బకాయిలు అడిగితే బ్లాక్‌మెయిల్ చేస్తారా.. ప్రభుత్వంపై బండి ఫైర్

TG: ఫీజు బకాయిలు అడిగిన విద్యాసంస్థలను విజిలెన్స్ దాడులతో బ్లాక్‌మెయిల్ చేస్తారా అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. బిహార్ ఎన్నికలకు ఇక్కడి నుంచి డబ్బులు పంపే సర్కార్.. విద్యార్థుల భవిష్యత్తు కోసం బకాయిలు చెల్లించలేదా అని ప్రశ్నించారు. తక్షణమే బకాయిలు విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడొద్దని, అండగా ఉంటామని విద్యాసంస్థలకు భరోసా ఇచ్చారు.