News January 1, 2026
ఖమ్మం: ఇంటర్నేషనల్ బాల్ బ్యాడ్మింటన్‌లో శశికళకు స్వర్ణం

అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో చిరునోములు గ్రామానికి చెందిన శశికళ అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించారు. బిహార్‌లో జరిగిన ఈ పోటీల్లో భారత జట్టు తరఫున ఆడి దేశానికి పేరు తెచ్చారు. గతంలో తొమ్మిది జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. తన విజయానికి తల్లిదండ్రులు, కోచ్ శిక్షణే కారణమన్నారు. శశికళ సాధించిన ఈ ఘనతపై జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News January 2, 2026
నల్గొండ: మున్సిపాలిటీల్లో పెరిగిన 31,902 మంది ఓటర్లు

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2020లో (నకిరేకల్ మినహా) 18 మున్సిపాలిటీల్లో 6,33,683 మంది ఓటర్లు ఉండగా, తాజా ముసాయిదా జాబితా ప్రకారం ఆ సంఖ్య 6,65,585కు చేరింది. నాలుగేళ్లలో కొత్తగా 31,902 మంది ఓటర్లు పెరిగారు. 2023 అసెంబ్లీ ఎన్నికల జాబితా ఆధారంగా ఈ ముసాయిదాను సిద్ధం చేశారు. విశేషమేమిటంటే, ఓటర్ల నమోదులో పురుషుల కంటే మహిళలే ఆధిక్యంలో ఉండటం.
News January 2, 2026
కృష్ణా: రైతులకు రాజముద్రతో కొత్త పాస్‌పుస్తకాలు

కృష్ణా జిల్లాలో రీ-సర్వే పూర్తయిన 176 గ్రామాల రైతులకు రాజముద్ర కలిగిన నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాలోని 21 మండలాల్లోని లబ్ధిదారులకు ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే గ్రామసభలలో వీటిని అందజేయనున్నారు. ఇప్పటికే E-KYC ప్రక్రియ ముగియగా, బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తయిన వారికి నేరుగా పట్టాలు అందనున్నాయి.
News January 2, 2026
నల్గొండ: రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు!

ఉమ్మడి జిల్లాలో డిసెంబర్ మాసంలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. గతనెలలోనే ఒకపక్క కొత్త మద్యం షాపులు తెరుచుకోవడం, మరో పక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు, థర్టీ ఫస్ట్ వేడుకలు జరగడంతో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. దీంతో ఒక్క నెలలోనే నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మొత్తం 245 మద్యం షాపుల ద్వారా రూ.452 కోట్ల వ్యాపారం సాగింది. గతేడాది కంటే ఈ డిసెంబర్ నెలలోనే రూ.167 కోట్లు అధికంగా ఆదాయం వచ్చింది.


