News April 22, 2025
ఖమ్మం: ఇంటర్ ఫలితాల్లో కృష్ణవేణి ప్రతిభ

ఇంటర్ ఫలితాల్లో ఖమ్మంలోని కృష్ణవేణి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. సెకండియర్‌లో హాసిని 994, ప్రియాంబిక 993, సంతోశ్ 991, జ్యోత్స్న 994, నవ్యశ్రీ 988, ఫస్టియర్‌లో భువనకృతి 468, పవిత్ర 468, హర్షిత్ 467, ప్రహర్ష 437, కరుణశ్రీ 437 ఉత్తమ రిజల్ట్ సాధించారని డైరెక్టర్ జగదీశ్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల తోడ్పాటుతోనే ఈ ఫలితాలు సాధించగలిగామని డైరెక్టర్ యార్లగడ్డ వెంకటేశ్వర రావు తెలిపారు.
Similar News
News January 10, 2026
ప్రాజెక్టులకు కేంద్రం సాయం అందించాలి: Dy.CM భట్టి

తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని Dy.CM భట్టి విక్రమార్క కోరారు. శనివారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన భేటీలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే కేంద్ర లక్ష్యాన్ని అభినందిస్తూనే, రాష్ట్ర అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కోరారు. విభజన హామీలు,పెండింగ్ నిధులపై కూడా చర్చించారు.
News January 10, 2026
పండక్కి ఊరెళ్తున్నారా?.. జాగ్రత్తలు తప్పనిసరి: సీపీ సునీల్ దత్

ఖమ్మం: సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లేవారు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ సునీల్ దత్ సూచించారు. విలువైన నగదు, బంగారాన్ని వెంట తీసుకెళ్లాలని లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని కోరారు. ఇంటికి తాళం వేసినప్పుడు ఇరుగుపొరుగు వారికి లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రాత్రి గస్తీ ముమ్మరం చేశామని, అనుమానితులు కనిపిస్తే వెంటనే ‘100’కు డయల్ చేయాలని తెలిపారు.
News January 10, 2026
ఖమ్మం కలెక్టర్ అనుదీప్‌కి ‘బిట్స్ పిలాని’ పురస్కారం

ప్రజా సేవలో విశేష ప్రతిభ కనబరుస్తున్న ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ప్రతిష్ఠాత్మక ‘బిట్స్ పిలాని యంగ్ అలుమ్ని అచీవర్’ అవార్డు లభించింది. ప్రజా జీవిత రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. గతంలో సివిల్స్ టాపర్‌గా నిలిచిన అనుదీప్, ప్రస్తుతం పాలనలో తనదైన ముద్ర వేస్తూ యువతకు స్ఫూర్తినిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పలువురు కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


