News April 26, 2024

ఖమ్మం: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

భద్రాచలం పట్టణంలోని భగవాన్ దాస్ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని(19) గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల కథనం ప్రకారం.. బుధవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అవడంతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.

Similar News

News November 11, 2025

అందెశ్రీకి మన ఖమ్మంతో ప్రత్యేక అనుబంధం

image

ప్రముఖ రచయిత అందెశ్రీ నిన్న మరణించిన సంగతి తెలిసిందే. అయితే అందెశ్రీకి మన ఖమ్మంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన నెలనెల వెన్నెల 65వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాయమైపోతున్న మనిషి విలువల గురించి చేసిన ప్రసంగం, పాడిన పాటను పలువురు నెమరేసుకున్నారు. అందెశ్రీ మృతికి నెలనెల వెన్నెల నిర్వాహకులు సంతాపం తెలిపారు. అందెశ్రీ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నామన్నారు.

News November 11, 2025

ఖమ్మంలో కొత్త రేషన్ కార్డుల జోరు

image

పేదలకు ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీని వేగవంతం చేసింది. జనవరి నాటి 4,11,143 కార్డులకు అదనంగా 52,406 కొత్త కార్డులు మంజూరయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కార్డుల సంఖ్య 4,63,549కి చేరింది. ఏప్రిల్ 1 నుంచి ఉచిత సన్న బియ్యం పంపిణీ జరగడంతో కొత్తగా లబ్ధి పొందుతున్న వారికి ఉపశమనం లభించింది.

News November 11, 2025

కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి: మంత్రులు

image

ఖమ్మం జిల్లాలోని ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలలో రైతులకు సౌకర్యాలు కల్పించాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ అనుదీప్‌కు కేంద్రాలను ప్రారంభించాలని ధాన్యం త్వరగా తరలించాలని సూచించారు. తార్పాలిన్లు, గన్నీ సంచులు, ప్యాడీ క్లీనర్లు సహా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని మంత్రులు స్పష్టం చేశారు.