News April 19, 2025
ఖమ్మం: ఈనెల 20న నెల నెలా వెన్నెల కార్యక్రమం

ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఈ నెల 20న సాయంత్రం 6 గంటలకు నెల నెలా వెన్నెల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మోటమర్రి జగన్మోహన్ రావు, అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్, కె.దేవేంద్ర, నాగబత్తిని రవి, వేల్పుల విజేత, లక్ష్మీనారాయణ, వేముల సదానందం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన సిరిమువ్వ కల్చరల్స్ కళాబృందం ‘హక్కు’ నాటిక ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
Similar News
News April 19, 2025
కూసుమంచి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

కూసుమంచిలోని హైస్కూల్ ఎదురుగా రెండు రోజుల క్రితం రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన పోచారం గ్రామానికి చెందిన ఇందుర్తి శ్రీనివాసరెడ్డి చనిపోయారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
News April 19, 2025
ఖమ్మం కంచుకోటలో.. ఎర్ర జెండా పార్టీలు పుంజుకునేనా?

దేశంలో కమ్యూనిస్టులకు ఉమ్మడి ఖమ్మంజిల్లా అడ్డాగా ఉండేది. జిల్లాను CPI, CPM, CPIML మాస్ లైన్, CPIML న్యూ డెమోక్రసీ నేతలు ఏకఛత్రాధిపత్యంతో ఏలారు. అలాంటి ప్రాంతాల్లో నేడు ఆ పార్టీల ఉనికి తగ్గుతుంది. నాడు ప్రజాసమస్యలపై కదిలిన ఎర్ర దండు.. నేడు ఆ స్థాయిలో ప్రభావం చూపడం లేదనే మాటలు వినవస్తున్నాయి. అలాగే కమ్యూనిస్టుల మధ్య సమన్వయం కూడా లోపించిందని అంటున్నారు. మళ్లీ ఆ పార్టీలు పుంజుకునేనా.. కామెంట్ చేయండి.?
News April 19, 2025
ఖమ్మం: రేపటి నుంచి పదో తరగతి ఓపెన్ పరీక్షలు

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్ 2025 థియరీ పబ్లిక్ పరీక్షలు రేపటి నుంచి ఈ నెల 26 వరకు నిర్వహిస్తున్నట్లు డిఇఓ సోమశేఖర శర్మ తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 8 పరీక్షా కేంద్రాల్లో 1553 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు.