News October 14, 2025
ఖమ్మం: ఈ గ్రామాలకు రూ.కోటి

పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద మోడల్ సోలార్ విలేజ్‌లకు కేంద్రం ప్రోత్సాహకాలను అందజేస్తోంది. ఈ పథకాన్ని ఖమ్మంలో ఏప్రిల్ 4 నుంచి OCT3, భద్రాద్రిలో ఏప్రిల్ 9 నుంచి OCT 8వరకు అమలు చేశారు. ఉమ్మడి జిల్లాలో 22 గ్రామాలు ఎంపికయ్యాయి. ఖమ్మం జిల్లా నుంచి కొణిజర్ల, కొత్తగూడెం నుంచి భద్రాచలం విజేతలుగా నిలిచాయి. ఈ గ్రామాలకు ఇచ్చే రూ.కోటి నిధులను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని నిర్దేశించారు.
Similar News
News October 14, 2025
చలిగాలి చూడు.. గిలిగింత పెడుతున్నది!!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం ఎండింగ్‌కు చేరిందో లేదో వింటర్ ఎంటరైంది. కొద్ది రోజులుగా ఉభయ రాష్ట్రాల్లో రాత్రివేళ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. కొన్నిచోట్ల టెంపరేచర్ సగటున 18-16కు పడిపోతోంది. దీంతో తెల్లవారుజామున పనులకు వెళ్లాల్సిన వారు, కసరత్తులతో కాస్త ఒళ్లు కరిగిద్దాం అనుకున్న వారు అలారాన్ని ఓసారి స్నూజ్ చేసి కానీ లేవడం లేదు. బయటకు వచ్చాక కూడా చల్లగాలులతో మెల్లగా వణుకు మొదలైంది. మీకూ…?
News October 14, 2025
SRSP అప్డేట్.. 4గేట్ల ద్వారా నీటి విడుదల

SRSP ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి 22,290 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా 4 గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాకతీయకు 5000, ఎస్కేప్ గేట్లు (రివర్) 3000, సరస్వతి కాలువ 650, లక్ష్మి 200, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు తగ్గుతోంది. నీటిమట్టం 1091 అడుగులు కాగా 80.501TMC నీరు ఉంది.
News October 14, 2025
వనపర్తి: అధికారులు సూచించిన చోటే బాణాసంచా విక్రయించాలి

జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా బాణాసంచా విక్రయిస్తే పేలుడు పదార్థాల చట్టం-1884, రూల్స్- 1933సవరణ 2008ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రావుల గిరిధర్ హెచ్చరించారు. రద్దీ ప్రదేశాల్లో టపాసుల దుకాణాలు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలు, నియంత్రికలు, పెట్రోల్ బంకుల సమీపంలో కాకుండా తహసీల్దార్, ఫైర్ విభాగం, పోలీసుశాఖ సూచించిన ప్రదేశాల్లో లైసెన్స్‌దారులు విక్రయించాలన్నారు.