News August 25, 2025

ఖమ్మం: ఈ నెల 30 చివరి తేదీ..!

image

డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందడానికి ఈనెల 30 వరకు గడువు ఉందని ప్రాంతీయ అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ గుగులోతు వీరన్న తెలిపారు. ఆదివారం ఎస్ఆర్అండ్‌బీజీఎన్ఆర్ కళాశాలలో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అతి తక్కువ ఫీజులతో బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

Similar News

News August 25, 2025

KMM: ఉపాధ్యాయ పదోన్నతుల జాబితా సిద్ధం

image

ఖమ్మం జిల్లాలో ఎస్టీల నుంచి ఎస్ఏ(స్కూల్ అసిస్టెంట్లు)లుగా పదోన్నతి పొందే వారి జాబితాను విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లాలో 1: 3 నిష్పత్తిలో సుమారు 600 మంది ఎస్టీలు ఉండగా 1:1 నిష్పత్తిలో వివిధ సబ్జెక్ట్‌లు సంబంధించి 207 మందితో తుది జాబితా తయారు చేశారు. కాగా ఈరోజు ఈ 207 మందికి వెబ్ ఆప్షన్లు మొదలుకానున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

News August 25, 2025

ఖమ్మం: వేధిస్తున్నాడని భర్తని చితకబాదిన భార్య

image

మద్యం తాగి భర్త వేధిస్తున్నాడని భార్య చితకబాదిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వీఎంబంజర్ గ్రామానికి చెందిన పర్వతం గంగరాజు, లక్ష్మికి 25 ఏళ్ల కిందట వివాహమైంది. భర్త రోజూ తాగి లక్ష్మిని వేధిస్తున్నాడు. వేధింపులు తాళలేక లక్ష్మి ఆదివారం భర్తను చితకబాదింది. గంగరాజుకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News August 25, 2025

ఖమ్మంలో మట్టి గణపయ్య విగ్రహాలు పంపిణీ

image

ఖమ్మం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నుంచి గణపయ్య ఉచిత విగ్రహాల పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు కమిషనర్ 8 వేల మట్టి విగ్రహాలను కేఎంసీకి తెప్పించారు. ఆదివారం రాత్రికి విగ్రహాలు కేఎంసీకి చేరుకున్నాయి. అన్ని ప్రాంతాల్లో వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరం నగరంలో మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసి పర్యావరణం పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ అధికారులు కోరారు.