News March 4, 2025

ఖమ్మం: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం నగరంలోని మహిళా ప్రాంగణంలో వివిధ కోర్సులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు మహిళా ప్రాంగణం అధికారి వేల్పుల విజేత తెలియజేశారు. 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు ఈనెల పదో తేదీలోగా ఖమ్మంలోని మహిళా ప్రాంగణంలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. మరిన్ని వివరాలకు టేకులపల్లిలో ఉన్న మహిళా ప్రాంగణం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

Similar News

News March 4, 2025

పులిగుండాల ప్రాంతంలో రూఫస్ బెల్లిడ్ ఈగల్ ప్రత్యక్షం

image

పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు ప్రాంతంలో అరుదైన ఆసియా డేగ కెమెరాల్లో చిక్కింది. అటవీశాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఆసియా ప్రాంతానికి చెందిన వేటాడే పక్షి రూఫస్ బెల్లిడ్ ఈగల్‌గా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ విలక్షణమైన పక్షి తల, మెడ, రెక్కలు, వీపు, తోక స్లాటీ నల్లగా ఉంది. దాదాపు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న ఈ పక్షి ఇక్కడ కనిపించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News March 4, 2025

ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు 

image

యాసంగి పంటలను సంరక్షించేలా అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి యాసంగి పంటలకు సాగునీటి సరఫరా, గురుకులాల్లో రెగ్యులర్‌గా తనిఖీలు, ప్లాస్టిక్ ఫ్రీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు.

News March 4, 2025

ప్రజా అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

image

రఘునాథపాలెం: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఆయా శాఖలకు వచ్చిన అర్జీలను మరొకమారు పరిశీలన చేసి, పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు.

error: Content is protected !!