News April 4, 2024
ఖమ్మం: ఉన్నతాధికారుల కో-ఆర్డినేషన్ సమావేశం

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల కో-ఆర్డినేషన్ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీ రావు, విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా, ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్, ఖమ్మం సీపీ సునీల్ దత్, అడిషనల్ కలెక్టర్ మధు సూధన్ నాయక్ రెండు సరిహద్దు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 18, 2025
ఖమ్మం పార్కు, ఖిల్లా రోప్‌వే అభివృద్ధికి ₹18 కోట్లు

ఖమ్మంలోని వెలుగుమట్ల అర్బన్ పార్కు, ఖిల్లా రోప్‌వే అభివృద్ధికి ప్రభుత్వం ₹18 కోట్లు మంజూరు చేసింది. పురపాలక శాఖ కార్యదర్శి శ్రీదేవి ఈ మేరకు జీఓ నెం.51ని విడుదల చేశారు. వెలుగుమట్ల పార్కు అభివృద్ధి, నిర్వహణకు ₹3 కోట్లు, ఖిల్లా రోప్‌వే, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం ₹15 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో జిల్లాలో పర్యాటకం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
News September 18, 2025
ఖమ్మం: వైద్య ఆరోగ్యంపై Dy.CM సమీక్ష

ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో Dy.CM మల్లు భట్టి విక్రమార్క వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షించారు. జిల్లాలోని ప్రభుత్వ, 627 ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలకు అంకితభావంతో సేవలందించాలని ఆయన ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి, జిల్లా స్థాయిలో కోఆర్డినేటర్ల ద్వారా మానిటరింగ్ కొనసాగుతోందని తెలిపారు. ఆధునిక సౌకర్యాలు కల్పించి, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
News September 18, 2025
అంధుల పాఠశాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక

ఖమ్మం జిల్లాలో అంధుల కోసం పాఠశాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అంధుల స్కూల్ ఏర్పాటుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ, జడ్పీ సీఈఓ, విద్యాశాఖ అధికారులతో చర్చించారు. త్వరలోనే పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు.