News February 27, 2025

ఖమ్మం: ఊటీని తలదన్నేలా.. వెలుగుమట్ల అర్బన్ పార్కు

image

కనుచూపు మేరంతా పచ్చదనం, ఆకాశ హర్య్మాలతో కనువిందు చేస్తుంది వెలుగుమట్ల అర్బన్ పార్కు. ప్రకృతి అందాలు ఓ వైపు.. పర్యాటక శోభ మరో వైపుతో పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ పార్కు అందాలను ఖమ్మం వాసులే కాకుండా చుట్టు పక్కల ప్రజలు ఆస్వాదిస్తున్నారు. 440 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కులో 30 ఎకరాల్లో పర్యాటకాన్ని వృద్ధి చేస్తున్నారు.. ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నారు.

Similar News

News February 23, 2026

కర్ణాటక హైకోర్టుకు రణ్‌వీర్ సింగ్

image

తనపై నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేయాలని కోరుతూ బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అర్జెంట్ హియరింగ్ చేపట్టాలన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకని.. పిటిషనర్ బాలీవుడ్ స్టార్ కాబట్టి విచారణ వేగవంతం చేయాలా? అని జస్టిస్ నాగప్రసన్న ప్రశ్నించారు. దీనిపై రేపు విచారణ జరగనుంది. కాంతారలో దైవాన్ని కించపరిచారంటూ <<18988013>>రణ్‌వీర్‌పై<<>> కేసు నమోదైంది.

News February 23, 2026

ASF: డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ఆత్రం సుగుణ

image

వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షులకు నిర్వహిస్తున్న పది రోజుల శిక్షణ శిబిరం మూడో రోజు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరై మార్గదర్శనం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పాల్గొన్నారు. రాజ్యాంగ పీఠిక ప్రతిని మంత్రి భట్టికి అందజేశారు. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై చర్చించారు.

News February 23, 2026

NGKL: పోలీస్ ప్రజావాణికి 5 దరఖాస్తులు

image

నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 5 దరఖాస్తులు వచ్చాయి. ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సూచనలు చేశారు. ప్రజల భద్రతే తమ ప్రాధాన్యతని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.