News September 21, 2025

ఖమ్మం: ఊరెళ్తున్నారా.. ఊడ్చేస్తారు జాగ్రత్త..!

image

బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రభుత్వం నేటి నుంచి 13 రోజుల వరకు సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మంలో పట్టణాలు విడిచి, సొంత ఊర్లకు, విహారయాత్రలకు, బంధువుల ఇళ్లకు వెళ్తుంటారు. ఇదే అదునుగా భావించి దొంగలు రెచ్చిపోతుంటారు.. ఇళ్లు విడిచి వెళ్లేటప్పుడు డబ్బులు, బంగారు, వెండి ఆభరణాలపై జాగ్రత్తలు తీసుకోండి. విలువైన వస్తువులు ఇంట్లో ఉంటే తమకు ముందస్తు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Similar News

News September 21, 2025

సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలో పడి మృతి

image

TG: అధికారుల కళ్లుగప్పి 9 మంది యువకులు అనుమతి లేని జలపాతం వద్దకు వెళ్లగా, వారిలో ఒకరు మృతిచెందిన ఘటన ములుగు(D)లో జరిగింది. HYDలోని ఉప్పల్‌కు చెందిన మహాశ్విన్ 8మంది స్నేహితులతో కలిసి వాజేడు(M) కొంగాల జలపాతానికి వెళ్లారు. అక్కడ సెల్ఫీ తీసుకునేందుకు జలపాతం గట్టుమీద కూర్చొని కాలుజారి నీటిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు.

News September 21, 2025

ALP: జోగుళాంబకు గద్వాల సంస్థానాధీశుల కానుకలు

image

అలంపూర్‌లో వెలసిన జోగులాంబ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గద్వాల సంస్థానం వంశస్థులు కానుకలు అందజేశారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించేందుకు 9 చీరలను బహుకరించారు. సంస్థానాధీశులు అమ్మవారికి చీరలు అందజేయడం పట్ల నడిగడ్డ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈవో దీప్తి చీరలు, సారె కానుకలను స్వీకరించినట్లు తెలిపారు.

News September 21, 2025

ఈ ఏడాది నవరాత్రుల ప్రత్యేకత ఏంటంటే?

image

ఈ ఏడాది చైత్ర నవరాత్రులు ఆదివారం ప్రారంభం కావడంతో దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భూమిపైకి ఏనుగు మీద వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ ఆగమనం అత్యంత శుభప్రదమని అంటున్నారు. ‘అందువల్ల సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి, దేశం సుభిక్షంగా ఉంటుంది. దుర్గమ్మ తన భక్తులను కష్టాల నుంచి విముక్తి చేసి, సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది. దీంతో మన జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయి’ అని సూచిస్తున్నారు.