News February 2, 2026

ఖమ్మం: ఎనిమిది మంది అభ్యర్థుల ఉపసంహరణ

image

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఆదివారం 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఏదులాపురంలో అత్యధికంగా ఏడుగురు (కాంగ్రెస్‌-4, బీజేపీ-1, బీఎస్పీ-1, బీఆర్‌ఎస్‌-1) పోటీ నుంచి తప్పుకున్నారు. కల్లూరులో బీఆర్‌ఎస్‌కు చెందిన ఒక అభ్యర్థి నామినేషన్‌ విత్‌డ్రా చేసుకున్నారు.

Similar News

News February 11, 2026

13న ఆర్టీఏ సేవలకు అంతరాయం: డీటీఓ జగదీష్

image

హైదరాబాద్‌లో నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమం కారణంగా ఈనెల 13న జిల్లాలో వాహన రవాణా శాఖ సేవలకు అంతరాయం కలగనుంది. వైరా కార్యాలయ సిబ్బంది శిక్షణకు హాజరవుతుండటంతో అక్కడ సేవలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి (DTO) ధర్మపురి జగదీష్ తెలిపారు. ఖమ్మం, సత్తుపల్లి కార్యాలయాల్లో సేవలు పాక్షికంగానే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు, ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.

News February 11, 2026

ఖమ్మం జిల్లాలో తొలి రెండు గంటల్లో 15.37% ఓటింగ్

image

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్ ఉత్సాహంగా ప్రారంభమైంది. తొలి రెండు గంటల్లో (ఉదయం 9 గంటల వరకు) సగటున 14.44 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా కల్లూరులో 19.80%, కనిష్ఠంగా మధిరలో 12.72% పోలింగ్ జరిగింది. ఏదులాపురంలో 15.65%, వైరాలో 14.52%, సత్తుపల్లిలో 15.12% ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.

News February 11, 2026

ఖమ్మం: పుర ఎన్నికలు…1,100 మందితో బందోబస్తు

image

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పుర ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఎన్నికలకు 1,100మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో నలుగురు ఆడిషనల్ డీసీపీలు, ఎనిమిది మంది ఏసీపీలు, 25 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 975 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించాలని సీపీ సూచించారు.