News October 10, 2025
ఖమ్మం: ఎన్నికలకు బ్రేక్.. ఆశావహుల కలలు ఆవిరి

స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు స్టే విధించడంతో జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. 42% రిజర్వేషన్ ఆధారంగా పోటీ చేయాలనుకున్న ఉమ్మడి జిల్లాలోని బీసీ ఆశావహుల కలలు ఆవిరయ్యాయి. దీంతో బీసీలకు నిరాశే మిగిలిందని తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఆదేశాలతో జిల్లా అధికారులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను (ఎంసీసీ) ఎత్తివేశారు. ఇక కొత్త నోటిఫికేషన్‌పై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News October 10, 2025
ఏ ఒక్క పత్తి రైతూ నష్టపోకుండా చూడాలి: VZM జేసీ

ఏ ఒక్క పత్తి రైతు నష్టపోకుండా చూడాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాదవన్ ఆదేశించారు. పత్తి కొనుగోళ్లపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జేసీ ఛాంబర్‌లో శుక్రవారం జరిగింది. పత్తి రైతు ఈ-క్రాప్ కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వం పత్తికి మద్దతు ధర క్వింటా రూ. 8,110గా నిర్ణయించిందని, ఈ విషయాన్ని RSKల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
News October 10, 2025
గద్వాల్: సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండాలి

సమాచార హక్కు చట్టం ప్రభుత్వ అధికారుల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించడం జరిగిందని, ఈ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని కలెక్టర్ సంతోష్ అన్నారు. ఈనెల 5 నుంచి 12 వరకు ఆర్టీఐ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం గద్వాల ఐడిఓసి సమావేశపు మందిరంలో జిల్లా అధికారులకు చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించి కలెక్టర్ మాట్లాడారు.
News October 10, 2025
VZM: ‘సూపర్ జీఎస్టీతో అన్నివర్గాలకు ప్రయోజనకరం’

అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కల్గించే విధంగా జీఎస్టీ శ్లాబులను ప్రభుత్వం సవరించిందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి చెప్పారు. దీనిని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో వాణిజ్య పన్నులశాఖ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన 2 రోజుల ప్రదర్శన, విక్రయాలను శుక్రవారం ప్రారంభించారు.