News February 8, 2026

ఖమ్మం: ఎన్నికల నోడల్ ఆఫీసర్‌గా వీవీఎల్ అన్నపూర్ణ

image

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల ఎన్నికల పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్‌గా అసిస్టెంట్ సెక్రటరీ వీవీఎల్ అన్నపూర్ణను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. ఏదులాపురం (32 వార్డులు), కల్లూరు (20), మధిర (22), సత్తుపల్లి (23), వైరా (20) పరిధిలో ఎన్నికల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారాన్ని ఆమె పర్యవేక్షిస్తారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు 92475 97048 నంబర్‌లో సంప్రదించాలని అధికారులు సూచించారు.

Similar News

News February 12, 2026

ఖమ్మం: కౌంటింగ్ కేంద్రాల వద్ద BNS 163 అమలు

image

ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని 5 మున్సిపల్ ఓట్ల లెక్కింపు సందర్భంగా శుక్రవారం మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధించినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. BNS సెక్షన్ 163 అమల్లో ఉంటుందని, ర్యాలీలు, సభలు, ఐదుగురికిపైగా గుమికూడటం నిషేధమన్నారు. విజయోత్సవాలు, డీజేలు, టపాసులపై నిషేధం విధించారు. అదేరోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ముగిసే వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సూచించారు.

News February 12, 2026

ఓటుతో సామాజిక మార్పు.. ట్రాన్స్‌జెండర్ల పౌర చైతన్యం

image

ఖమ్మం జిల్లాలోని 5మున్సిపాలిటీల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్లు ఉత్సాహంగా పాల్గొని పౌర బాధ్యత చాటారు. జిల్లాలో మొత్తం 24 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉండగా, వారిలో 17 మంది (దాదాపు 71%) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సత్తుపల్లిలో 11 మంది, మధిరలో ముగ్గురు, ఎదులాపురంలో ఇద్దరు, వైరాలో ఒకరు చొప్పున ఓటు వేశారు. సామాజిక గుర్తింపు, మార్పు కోసమే తాము ఓటు వేసినట్లు వారు పేర్కొన్నారు.

News February 12, 2026

రేపు యథావిధిగా రవాణా శాఖ సేవలు: డీటీఓ

image

ఖమ్మం జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాల్లో రేపు అన్ని రకాల సేవలు యధావిధిగా అందుబాటులో ఉంటాయని డీటీఓ ధర్మపురి జగదీష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయంతో పాటు సత్తుపల్లి, వైరాలోని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ కార్యకలాపాలు సాగుతాయని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ముందస్తుగా స్లాట్లు బుక్ చేసుకోవచ్చని, వాహన రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల జారీ తదితర సేవల కోసం కార్యాలయాలకు రావచ్చని పేర్కొన్నారు.