News January 13, 2026

ఖమ్మం: ఎల్‌ఐజీ ఫ్లాట్ల దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు

image

ఖమ్మం శ్రీరాంనగర్‌లో హౌసింగ్ బోర్డు నిర్మించిన LIGఫ్లాట్ల దరఖాస్తు గడువును జనవరి 20వరకు పొడిగించినట్లు చీఫ్ ఇంజనీర్ జివి రమణారెడ్డి తెలిపారు. అప్రోచ్ రోడ్డు సమస్య పరిష్కారం కావడంతో మరోసారి దరఖాస్తులకు అవకాశం కల్పించామని చెప్పారు. అల్పాదాయవర్గాల కోసం కేటాయించిన ఈఫ్లాట్లకు ఆసక్తి గల వారు మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తుచేసుకోవాలని సూచించారు. జనవరి 23న లాటరీ ద్వారా ఫ్లాట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు.

Similar News

News January 30, 2026

ఖమ్మం: బాక్సింగ్‌లో ‘రూప’ మెరుపు

image

నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెం గురుకుల కళాశాల విద్యార్థిని వి.రూప బాక్సింగ్‌లో సత్తా చాటింది. హైదరాబాద్‌లో జరిగిన అండర్-19 రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఫిబ్రవరిలో కర్ణాటకలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు రూప ఎంపికైంది. ప్రతిభ చాటిన రూపను ప్రిన్సిపాల్ శ్రీలత, క్రీడా విభాగం సిబ్బంది ఘనంగా అభినందించారు.

News January 30, 2026

ఖమ్మం: ధీమాతో నామినేషన్.. టికెట్ కోసం టెన్షన్ !

image

ఖమ్మం జిల్లాలో 2వ రోజు 309 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటితో ముగియనుండటంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. నేతలు గెలుపు గుర్రాల వేటలో ఉండగా.. టికెట్ వస్తుందన్న ధీమాతో కొందరు, నేతలహామీతో మరికొందరు నామినేషన్లు సమర్పిస్తున్నారు. కాగా టికెట్ దక్కుతుందో లేదోనని పలువురు ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. టికెట్ దక్కని వారు పక్క పార్టీ నేతలలో సంప్రదింపులు జరుపుతున్నారు.

News January 30, 2026

ప్రతి బిడ్డ చదువుకోవాలి: జిల్లా కలెక్టర్

image

ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్న ‘ప్రతి బిడ్డ చదువుతుంది’ కార్యక్రమంపై గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్రీజ, జిల్లా విద్యాశాఖ అధికారిణి (DEO) చైతన్య జైనీతో కలిసి అన్ని మండల విద్యాధికారులు (MEO), ప్రధానోపాధ్యాయులతో (HM) ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల వయస్సున్న ప్రతి బిడ్డను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.