News April 3, 2026
ఖమ్మం: ఏప్రిల్ వరకు ‘ఉపాధి హామీ’.. మే నుంచి కొత్త పేరుతో అమలు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈ నెలాఖరు వరకు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మే నెల నుంచి ఈ పథకాన్ని ‘వీబీజీరాంజీ’ పేరుతో అమలు చేయనున్నట్లు సమాచారం. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో రూ. 98.34 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ. 147 కోట్ల లేబర్ బడ్జెట్‌తో పనిదినాలు కల్పించారు. ప్రస్తుతం కూలీలకు రోజుకు రూ. 307 కనీస వేతనం చెల్లిస్తున్నారు.
Similar News
News April 14, 2026
గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్.. లక్షణాలు ఇవే

కొందరు మహిళల గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు అనే గడ్డలు తయారవుతుంటాయి. దీని వల్ల నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి ఉంటాయి. ఈ ఫైబ్రాయిడ్స్ పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడిపడి తరచూ మూత్రవిసర్జన, మూత్రవిసర్జన పూర్తిగా జరగకపోవడం, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు గర్భసంచి లోపలి పొరల్లో ఏర్పడతాయి. వీటి వల్ల గర్భస్రావం జరగడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
News April 14, 2026
NLG: డిగ్రీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరంలో సీట్ల భర్తీకి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు తొలి విడతలో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని NLGలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, ప్రొఫెసర్ శ్రీనివాసరాజు, దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ సుంకరి రాజారామ్ తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News April 14, 2026
శివునికి ఏ అభిషేకంతో ఏ ఫలితం వస్తుంది?

శివాభిషేకంలో వాడే ప్రతి వస్తువు ఓ ప్రత్యేక ఫలితాన్నిస్తుందని నమ్మకం. ఆవు పాలతో సౌఖ్యాలు, పెరుగుతో బలం, నెయ్యితో ఐశ్వర్యం, కొబ్బరి నీటితో సంపద, చెరకు రసంతో ధనవృద్ధి కలుగుతుందట. నీటితో పోగొట్టుకున్నవి తిరిగి దక్కుతాయట. ద్రాక్ష రసంతో విజయం, పసుపు నీటితో శుభాలు, తేనెతో తేజోవృద్ధి, అన్నంతో దీర్ఘాయువు, భస్మంతో పాపాలు నశిస్తాయని విశ్వాసం. ఏ అభిషేకం చేసినా, ఫలితం దక్కాలంటే మనలో నిష్కల్మషమైన భక్తి ఉండాలి.


