News August 28, 2025

ఖమ్మం ఐటీ హబ్‌లో ఉచిత శిక్షణ

image

ఖమ్మం ఐటీ హబ్‌లో నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు ప్రాంతీయ కేంద్ర మేనేజర్ అశోక్ తెలిపారు.
శిక్షణ ఇచ్చే కోర్సులు:
HTML5, CSS3, JavaScript, Bootstrap 5
Java, Python
Database
Aptitude & Reasoning, Soft-Skills & IT-Skills
డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర కోర్సులు పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 6లోగా ఐటీ హబ్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు నెం. 95025 05880.

Similar News

News August 29, 2025

జనగామ: యాంకర్ లోబోకు జైలు శిక్ష

image

యాంకర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్‌కు ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.12,500 జరిమానా విధిస్తూ జనగామ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. రఘునాథపల్లి ఎస్సై నరేష్ కథనం ప్రకారం.. 2018లో రఘునాథపల్లి మండలంలో అతివేగంగా కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన కేసులో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఈ రోజు తుది తీర్పు వెలువడింది.

News August 29, 2025

రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపాలి: DGP

image

నెల్లూరు జిల్లాలోని రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా జిల్లా పోలీసులను ఆదేశించారు. నెల్లూరులోని ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్షపై రివ్యూ నిర్వహించారు. నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

News August 29, 2025

మంథని: ‘లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

image

గోదావరినదిలో వరద ఉధృతి నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం మంథని పట్టణంలోని గోదావరితీరాన్ని ఆయన పరిశీలించారు. వివిధ ప్రాజెక్టుల నుంచి విడుదలవుతున్న నీటి వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.