News September 11, 2025
ఖమ్మం ఐటీ హబ్‌లో ప్లేస్‌మెంట్ డ్రైవ్

ఖమ్మం ఐటీ హబ్‌లో ఈ నెల 15న టాస్క్ ఆధ్వర్యంలో టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తుందని జిల్లా మేనేజర్ దినేష్ తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో బీటెక్ లేదా డిగ్రీలో 60% మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ డ్రైవ్‌కు అర్హులని అన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ రెజ్యూమ్, సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7981093223 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
Similar News
News March 5, 2026
రేపటి నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్: ఖమ్మం కలెక్టర్

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మార్చి 6 నుంచి 15 వరకు గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం అధికారులతో జరిగిన సమీక్షలో ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్లను 10 రోజుల్లో క్లియర్ చేయాలని సూచించారు. మార్చి 12న సర్పంచ్‌లు, కౌన్సిలర్‌లకు జిల్లా స్థాయి వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.
News March 5, 2026
ఖమ్మం: 414 మంది విద్యార్థులు గైర్హాజరు

ఖమ్మం జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ గణితం, జువాలజీ, హిస్టరీ పరీక్షకు 16,663 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు తెలిపారు. జనరల్ కోర్సుల్లో 14,801 మందికి గాను 14,526 మంది, అటు ఒకేషనల్ కోర్సుల్లో 2,276 మందికి గాను 2,137 మంది హాజరయ్యారని, మొత్తంగా 414 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. అటు ఇవాళ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.
News March 5, 2026
‘పది’ పరీక్షలకు ఒత్తిడికి లోనవద్దు: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంను గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులు భయం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. తరగతి గదులు, వంటగది, ఆహార నాణ్యతను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు.


