News December 10, 2025
ఖమ్మం: ఓటు వేయాలంటే.. గుర్తింపు కార్డులే ఆధారం!

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ పోలింగ్ రేపు జరగనుంది. ఉద్యోగులు పంపిణీ చేసే ఓటరు స్లిప్‌ను కేవలం సమాచారం కోసమే వినియోగించాలని, అది గుర్తింపు పత్రంగా చెల్లదని అధికారులు స్పష్టం చేశారు. ఓటు వేయడానికి ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్ సహా 18 రకాల గుర్తింపు పత్రాలలో ఏదో ఒకటి తప్పనిసరిగా చూపించాలని అధికారులు ఓటర్లకు సూచించారు.
Similar News
News December 10, 2025
వెబ్ కాస్టింగ్‌ను నిశితంగా పరిశీలించాలి: నిర్మల్ కలెక్టర్

ఎన్నికలు జరగనున్న పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటుచేసిన వెబ్ కాస్టింగ్‌ను నిశితంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణను ఆమె పరిశీలించి వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణ విధులు నిర్వహిస్తున్న అధికారులకు పలు సూచనలు చేశారు.
News December 10, 2025
అన్నమయ్య: 16 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి

అన్నమయ్య (D) వీరబల్లి మండలంలోని సోమవారం వడ్డిపల్లిలో దీపిక(16) మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లికి 2పెళ్లిళ్లు కాగా దీపిక మొదటి భర్త కుమార్తె. రెండో వివాహం తర్వాత తల్లి పాపని కొన్నిరోజుల క్రితం వడ్డిపల్లికి తీసుకువచ్చింది. అంతలోనే ఏం జరిగిందో తెలీదుగానీ ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై వీరబల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 10, 2025
ANU పరిధిలో బీటెక్ పరీక్షలు ప్రారంభం

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీటెక్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. బీటెక్ మూడో సంవత్సరం ప్రథమ సెమిస్టర్, నాలుగవ సంవత్సరం ప్రథమ సెమిస్టర్ (రెగ్యులర్) పరీక్షలతోపాటు మూడో సంవత్సరం ద్వితీయ సెమిస్టర్ (సప్లిమెంటరీ) పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. పీజీ, వృత్తివిద్య పరీక్షల విభాగం సమన్వయకర్త సుబ్బారావు ANUలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు.


