News December 29, 2025
ఖమ్మం: కబ్జాదారులకు పొంగులేటి వార్నింగ్

పేదల సంక్షేమం కోసం ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆక్రమణలను గుర్తించి వెంటనే నోటీసులు ఇవ్వాలని, అవసరమైతే ఖాళీ చేయించి భూములను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. వివాదాల్లో ఉన్న భూముల రక్షణకు న్యాయపరంగా గట్టిగా ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు.
Similar News
News December 30, 2025
జిల్లాలో 1,090 కేసులలో ₹11.88 కోట్ల ఆస్తి రికవరీ

2025లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,090 చోరీ కేసులు నమోదయ్యాయని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. అంతర్రాష్ట్ర ముఠాలపై దృష్టి సారించిన పోలీసులు పలు ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా రూ.11,88,55,702 విలువైన ఆస్థిని రికవరీ చేసినట్లు తెలిపారు. గత ఏడాదికి సంబంధించిన 176 కేసుల్లోనూ రికవరీ పూర్తి చేసి బాధితులకు ఆస్తులు అప్పగించారు. నేరాల నియంత్రణలో పోలీసుల సమర్థత ప్రశంసనీయం.
News December 30, 2025
నేర నియంత్రణలో జిల్లా పురోగతి సాధించింది: ఎస్పీ

మహిళల భద్రత, ప్రజా రక్షణకు ప్రాధాన్యం ఇచ్చి బాపట్ల జిల్లా పోలీస్ శాఖ నేర నియంత్రణలో గణనీయ పురోగతి సాధించిందని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. 2025లో జిల్లాలో నమోదైన నేరాలు గతేడాదితో పోలిస్తే 15 శాతం తగ్గాయన్నారు. వేగవంతమైన దర్యాప్తు, ముందస్తు చర్యలు, సీసీ కెమెరాల వినియోగం, రౌడీల కౌన్సిలింగ్ వల్ల నేరాల తీవ్రత తగ్గిందని వివరించారు.
News December 30, 2025
గౌరవం ఇచ్చి పుచ్చుకునేది: KTR

TG: అసెంబ్లీలో సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ <<18701442>>కరచాలనం<<>> చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో లేచి నిలబడకపోవడంతో KTRపై విమర్శలొచ్చాయి. వాటికి ఆయన తనదైనశైలిలో సమాధానం చెప్పారు. ‘నేను వ్యక్తులను బ్యాడ్‌గా ట్రీట్ చేయను. వాళ్లు ఎలా ఉంటారో అలాగే ట్రీట్ చేస్తాను’ అన్న కొటేషన్ షేర్ చేశారు. దానికి ‘గౌరవాన్ని గెలుచుకోవాలి.. ఆత్మగౌరవం విషయంలో రాజీ పడకూడదు’ అని క్యాప్షన్ పెట్టారు.


