News October 3, 2025
ఖమ్మం: కలిసొచ్చిన రిజర్వేషన్.. మళ్లీ ఆమే సర్పంచ్..

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు కొంతమందిని నిరాశ కలిగిస్తే మరికొంతమందికి కలిసొచ్చాయి. పెనుబల్లి మండలం గౌరవరంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక్క కుటుంబం మాత్రమే ఉంది. ఆ కుటుంబంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో ఆ కుటుంబంలోని మహిళ రుద్రజారాణి సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మళ్లీ అదే రిజర్వేషన్ రావడంతో సర్పంచ్ పదవి ఆమెకే దక్కనుంది.
Similar News
News October 3, 2025
రేపే ఖాతాల్లోకి రూ.15వేలు: టీడీపీ

AP: రాష్ట్ర ప్రభుత్వం రేపు ఆటో డ్రైవర్లకు దసరా కానుకను అందించనుందని టీడీపీ ట్వీట్ చేసింది. ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకంలో భాగంగా 2,90,234 మంది ఆటో రిక్షా/ మాక్సీ క్యాబ్/మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో ఉదయం 11 గంటలకు రూ.15వేల చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది. ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.435.35 కోట్లు ఖర్చు చేయనుంది.
News October 3, 2025
షాద్‌నగర్: అమ్మవారి చీరల వేలం@రూ.13లక్షలు

నవరాత్రులను పురస్కరించుకొని 11 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని మధురాపూర్ గ్రామంలో అమ్మవారికి 11రోజుల పాటు అలంకరణలో ఉపయోగించిన 11 చీరలకు వేలంపాటను నిర్వహించారు. వేలం పాటలో 11 చీరలను రూ.13,55,149కు గ్రామస్థులు దక్కించుకున్నారు. గతంలో వినాయకుడి లడ్డును కూడా రూ.12 లక్షలు దక్కించుకోవడం గమనార్హం.
News October 3, 2025
‘గోవిందా’ అంటే ఏంటో తెలుసా?

‘గోవిందా’ అంటే ఇంద్రియాలకు ఆనందాన్ని కలిగించేవాడు అని అర్థం. ఇంద్రియాల ద్వారా మనస్సుకు సంతోషాన్నిచ్చే భగవంతుడే గోవిందుడు. మరో కథనం ప్రకారం.. శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి గోవులను కాపాడినందుకు, కామధేనువు పాలాభిషేకం చేస్తుంది. అప్పుడు ఇంద్రుడు కూడా ఆయనను గోవులకు అధిపతిగా ప్రకటించి, గోవిందునిగా కీర్తించాడు. అప్పటినుంచి శ్రీనివాసుడు ఈ పవిత్ర నామంతో పూజలందుకుంటున్నాడు. <<-se>>#GovindhaNaamaalu<<>>