News August 16, 2025
ఖమ్మం కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు..!

మున్నేరు నదికి వరదలు పెరిగే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టరేట్‌లో టోల్-ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఫిర్యాదు చేయడానికి 1077, 9063211298 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. అన్ని శాఖల అధికారులు స్థానికంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News August 16, 2025
‘మున్నేరు పరివాహకా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

మున్నేరుకు వరద ప్రవాహం పెరగడంతో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులను సమన్వయంతో పనిచేయాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఎగువన వర్షాలు అధికంగా కురుస్తున్నందున వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News August 16, 2025
మున్నేరు వరద పరివాహక ప్రాంతంలో వాలంటీర్ల నియామకం…!

మున్నేరు వరద ఉధృతి నేపథ్యంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, వార్డు అధికారులు, వాలంటీర్లను నియమించారు. ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు వారికి సూచించారు. ప్రతి ఒక్కరూ తమ విధులను కేవలం బాధ్యతగా కాకుండా, పౌర సేవగా భావించాలని కోరారు.
News August 16, 2025
ఖమ్మం జిల్లాలో 579.9 MM వర్షపాతం నమోదు

ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో మొత్తం 579.9 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. కొనిజర్లలో అత్యధికంగా 70.9 మి.మీ, ఎర్రుపాలెం మండలంలో అసలు వర్షపాతం నమోదు కాలేదని సింగరేణి 61.4 మి.మీ, వైరా 55.4 మి.మీ, కుసుమాంచి 47.8 మి.మీ, కామేపల్లి 46.7 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.