News March 21, 2024
ఖమ్మం: కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనపై హై టెన్షన్

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనపై హై టెన్షన్ నెలకొంది. రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక చరిత్ర కలదు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఖమ్మంకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనపై సస్పెన్స్ సాగుతోంది. BRSతరఫున నామా, BJPతరఫున జలగం బరిలో ఉండగా కాంగ్రెస్లో నందిని,యుగేందర్,ప్రసాద్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థి ఖరారు కాగా అలకలు లేకుండా చేసి ప్రకటన చేయాలనీ అధిష్టానం భావిస్తుంది.
Similar News
News January 4, 2026
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమమే రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులు పడ్డ ఇబ్బందులను తొలగించేందుకు మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను పెంచామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని ఆయన పేర్కొన్నారు.
News January 4, 2026
ఖమ్మం: దరఖాస్తుల ఆహ్వానం

రేవంత్ అన్న కా సహారా, ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహ్మద్ ముజాహిద్ తెలిపారు. గతంలో ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, ఆ పత్రాలను సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాల్లో అందజేయాలని ఆయన సూచించారు.
News January 4, 2026
ఖమ్మం: ఏడాది గడిచినా అందని ‘ధాన్యం బోనస్’

ఖమ్మం జిల్లాలో ధాన్యం విక్రయించిన రైతులు బోనస్ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. గత యాసంగిలో క్వింటాకు రూ. 500 చొప్పున ప్రకటించిన బోనస్ ఇంతవరకు జమ కాలేదు. జిల్లావ్యాప్తంగా సుమారు రూ. 60 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని, ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.


