News November 15, 2025
ఖమ్మం: కానిస్టేబుల్ సూసైడ్

ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ధారావత్ బాలాజీ (38) శుక్రవారం ఎదులాపురం సింహద్రినగర్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో ఆయన సెలవుపై ఇంట్లోనే ఉంటున్నారు. గాయాల కారణంగా మనస్తాపం చెంది బాలాజీ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రూరల్ సీఐ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 15, 2025
సింగపూర్-విజయవాడ విమాన సర్వీసులు ప్రారంభం

సింగపూర్-విజయవాడ నేరుగా విమాన సర్వీసులు శనివారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. తొలి ఫ్లైట్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా, అందులో ప్రయాణించిన ప్రయాణికులు ప్రత్యేకంగా ప్లకార్డులు ప్రదర్శించి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు అంతర్జాతీయ ప్రయాణం మరింత సులభం చేసినందుకు ప్రభుత్వంపై ప్రశంసలు వ్యక్తమయ్యాయి.
News November 15, 2025
మెదక్: హోమ్ గార్డ్ సిబ్బంది సంక్షేమంపై సమీక్ష

హోమ్ గార్డ్ సిబ్బంది సంక్షేమార్థం యాక్సిస్ బ్యాంక్ అధికారులతో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ సమీక్షించారు. హోమ్ గార్డుల ఆర్థిక భద్రత, సామాజిక సంక్షేమం లక్ష్యంగా సమీక్ష చేశారు. హోమ్ గార్డులు జిల్లా పోలీస్ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రజల రక్షణలో ఎల్లప్పుడు ముందుంటున్న ఈ సిబ్బందికి అవసరమైన సహాయం, మార్గదర్శక, సంక్షేమ కార్యక్రమాలను అందించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని తెలిపారు.
News November 15, 2025
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 12 గోదాముల ఏర్పాటు

TG: రాష్ట్ర ప్రభుత్వం రూ.155.68 కోట్ల నిధులతో 12 గోదాములను నిర్మించనుంది. వీటి సామర్థ్యం 1.51 లక్షల టన్నులు. కరీంనగర్ జిల్లా లాపపల్లి, నుస్తులాపూర్, ఉల్లంపల్లిలో, NLG జిల్లా దేవరకొండ, VKB జిల్లా దుద్యాల, హనుమకొండ జిల్లా వంగర, ములుగు జిల్లా తాడ్వాయి, మెదక్ జిల్లా అక్కన్నపేట, పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్, ఖమ్మం జిల్లా అల్లిపురం, ఎర్రబోయినపల్లి, మంచిర్యాల జిల్లా మోదెలలో వీటిని నిర్మించనున్నారు.


