News August 15, 2024
ఖమ్మం: కాయిన్స్ తీసుకోకపోవడంతో గొడవ

నేలకొండపల్లి మండలంలోని తిరుమలాపురం
సమీపాన ఉన్న పెట్రోల్ బంక్‌లో బోదులబండకి చెందిన హరీశ్ అనే వాహనదారుడు రూ.163 పెట్రోల్ కొట్టమన్నాడు. బంకులో పనిచేసే వ్యక్తే హరీశ్ వద్ద ఉన్న చిల్లర కాయిన్లను చూసి ఫోన్ పే చేస్తేనే పెట్రోల్ కొడతానని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. బంక్ సిబ్బంది అసభ్య పదజాలంతో దూషించారని వాహనదారుడు సిబ్బంది, యాజమాన్యంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Similar News
News November 7, 2025
ఖమ్మంలో యాక్సిడెంట్.. యువకుడి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మంలో జరిగింది. ఖానాపురం హవేలీ పోలీసుల కథనం ప్రకారం.. గోపాలపురంలోని కశ్మీర్ దాబా ఎదురుగా అర్ధరాత్రి ఓ యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
News November 7, 2025
ఖమ్మం: వందేమాతరం గీతాలాపనలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్

వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా.శ్రీజ, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.శ్రీజ మాట్లాడుతూ.. కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిచ్చిన వందేమాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు.
News November 7, 2025
ఖమ్మం: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘వందే మాతరం’

జాతీయ గీతం ‘వందేమాతరానికి’ 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఖమ్మం పోలీస్ హెడ్ క్వాటర్స్ పరేడ్ గ్రౌండ్స్, అన్ని పోలీస్ స్టేషన్లలో వందే మాతరం జాతీయ గేయాన్ని సామూహికంగా ఆలపించే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ అధికారులందరూ పాల్గొన్నారు. ఈ వేడుకలు ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా జరగనున్నాయని పోలీస్ అధికారులు తెలిపారు.


