News March 6, 2025

ఖమ్మం: కాయిన్ మింగిన నాలుగేళ్ల చిన్నారి

image

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాండురంగాపురంలో నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ కాయిన్‌ మింగేశాడు. మోతీలాల్- శైలజ కుమారుడు ప్రద్యుత్ ఐదు రూపాయల కాయిన్‌తో ఆడుకుంటూ.. నోట్లో పెట్టుకుని మింగడంతో అది గొంతులో ఇరుక్కుపోయింది. చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన డాక్టర్లు గొంతులోని కాయిన్‌ను ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ లేకుండా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు.

Similar News

News March 6, 2025

ప్రపంచంలో బెస్ట్ టీమ్ ఇదేనట.. ఏమంటారు?

image

ప్రస్తుతం ప్రపంచంలో బెస్ట్ క్రికెట్ టీమ్ ఏదంటే అందరూ చెప్పేది టీమ్ఇండియా పేరు. కానీ, ఆల్‌టైమ్ బెస్ట్ & డేంజరస్ క్రికెట్ టీమ్ మాత్రం ‘2003 ఆస్ట్రేలియన్’ జట్టు అని కొందరు చెబుతుంటారు. ఆసీస్ వరుసగా 1999, 2003, 2007 వరల్డ్ కప్స్ గెలిచింది. అప్పట్లో గిల్ క్రిస్ట్& మాథ్యూ ఓపెనింగ్ అదిరిపోయేదంటున్నారు. రిక్కీ పాంటింగ్ కెప్టెన్సీలో ప్రత్యర్థులకు చుక్కలు కనపడేవని చెప్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News March 6, 2025

భారతి హత్య కేసులో తండ్రి, మరొకరి అరెస్ట్

image

గుంతకల్లు మండల పరిధిలోని కసాపురంలో వద్ద జరిగిన పరువు హత్యలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి రామాంజనేయులు, బావ మారుతి కలిసి భారతి (21)ని హత్య చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆటోను సీజ్ చేశారు. అనంతరం ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా కూతురు ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పడంతో తండ్రి దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే.

News March 6, 2025

PES విద్యాసంస్థల అధినేత కన్నుమూత

image

పీఈఎస్ విద్యాసంస్థల అధినేత ప్రొఫెసర్ ఎంఆర్ దొరస్వామి నాయుడు(85) కన్నుమూశారు. చిత్తూరు జిల్లాలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన దొరస్వామి 1972లో బెంగళూరులో 40 మంది విద్యార్థులతో పీఈఎస్ విద్యాసంస్థను ప్రారంభించారు. కర్ణాటక ఎమ్మెల్సీగా, ప్రభుత్వ సలహాదారుడిగా విద్యారంగానికి విశేషంగా కృషి చేశారు. బెంగళూరులోని తన నివాసంలో గురువారం సాయంత్రం దొరస్వామి నాయుడు తుది శ్వాస విడిచారు.

error: Content is protected !!