News February 28, 2026
ఖమ్మం కూల్చివేతలపై ఎన్‌హెచ్ఆర్సీ దర్యాప్తు?

ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల పేరుతో సుమారు 600 పేదల ఇళ్లను కూల్చి వేసిన ఘటన తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు ప్రారంభించింది. ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదు మేరకు కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని కమిషన్ ఆదేశించినట్లు సమాచారం.
Similar News
News March 1, 2026
త్వరలోనే 10గ్రాముల బంగారం రూ.2లక్షలు?

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలపై పెను ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర ₹1,70,000 <<19269997>>మార్కును<<>> దాటింది. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగి, ఇరు దేశాల మధ్య దాడులు తీవ్రమైతే అతి త్వరలోనే ఇది ₹2,00,000 మార్కును చేరుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం, వెండిని ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించడమే ఇందుకు కారణం.
News March 1, 2026
రేపు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)ను ఈ సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్‌సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చన్నారు.
News March 1, 2026
రామన్నపేట: డిగ్రీ పూర్తి చేయలేకపోయారా.. ఇది మీకోసమే

డిగ్రీ పూర్తి చేయలేకపోయిన వారికి MGU సువర్ణావకాశం కల్పించింది. రామన్నపేట డిగ్రీ కాలేజీలో 2010–11 నుంచి నేటి వరకు పాత(ఇయర్/సెమిస్టర్), నూతన విధానం(సెమిస్టర్)లో డిగ్రీ సకాలంలో పూర్తి చేయలేకపోయిన వారికి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ.డా.రాహత్ ఖానం, అకాడమిక్ కోఆర్డినేటర్ డా.J.చిన్నబాబు తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి MAR 4 చివరి తేదీ అని, బ్యాక్‌లాగ్ ఉన్నవారు ముందుకు రావాలని కోరారు.


