News September 10, 2025
ఖమ్మం: కేయూలో ఎల్ఎల్‌బీ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పరిధిలో ఈ నెల 12న జరగాల్సిన ఎల్ఎల్‌బీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎల్ఎల్‌బీ మూడేళ్ల కోర్సు రెండో సెమిస్టర్ (మూడో పేపర్), ఐదేళ్ల లా కోర్సు ఆరో సెమిస్టర్ (మూడో పేపర్) పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. వాయిదా వేసిన ఈ పరీక్షలు ఈనెల 15న జరుగుతాయని చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Similar News
News September 10, 2025
మెదక్: తొమ్మిది నెలల్లో 648 మంది సూసైడ్

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు వివిధ కారణాలతో 648 మంది ఆత్మహత్య చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో 204, మెదక్‌లో 228, సిద్దిపేటలో 216 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల రికార్డులు తెలుపుతున్నాయి. ప్రతి సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదని, ధైర్యంగా ఎదుర్కోవాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.
News September 10, 2025
రాజాంలో రేపు జాబ్ మేళా

రాజాం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంతకుమార్ తెలిపారు. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఏదైనా పీజీ చదివి వయసు 18-35లోపు ఉన్న యువతీ, యువకులు అర్హులన్నారు. 12 బహుళజాతి కంపెనీలు జాబ్ మేళాకు హాజరవుతున్నాయని, ఆసక్తి ఉన్నవారు https://naipunyam.ap.gov.in వెబ్ సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
News September 10, 2025
యువత ప్రాణాలు తీస్తున్న బ్రేకప్స్

దేశంలో బ్రేకప్‌ల వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని సూసైడ్ ప్రివెంటివ్ హెల్ప్‌లైన్ సంస్థ ‘వన్ లైఫ్’ తెలిపింది. అప్పులు, వైవాహిక సమస్యలు, నిరుద్యోగం, బెట్టింగ్, ఒత్తిడి, ఆర్థిక మోసాలతో మరికొందరు సూసైడ్ చేసుకుంటున్నట్లు వివరించింది. తమ సంస్థకు ఏటా సగటున 23,000 కాల్స్ వస్తున్నాయంది. ఫోన్ చేసిన వారిపై సానుభూతి చూపిస్తూ కౌన్సిలర్లు వారిలో ధైర్యం నింపుతారని వివరించింది.
* ఇవాళ ఆత్మహత్యల నివారణ దినోత్సవం