News December 5, 2024

ఖమ్మం కొత్త బస్టాండ్ వద్ద బైక్ – లారీ ఢీ.. వ్యక్తి మృతి

image

ఖమ్మం కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బైక్‌ – లారీ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతిచెందాడు. బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 13, 2026

ఖమ్మం: భక్తులకు గమనిక

image

మహాశివరాత్రి పండగను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఖమ్మం ఆర్ఎం సరీరామ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తీర్థాలకు, స్థానాల లక్ష్మీపురం, నీలాద్రి, అన్నపురెడ్డి పల్లి, మోతేగడ్డ, బెండలపాడు దేవాలయాలకు స్థానిక డిపోల-79 బస్సులు రాకపోకలు సాగిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలన్నారు.

News February 12, 2026

ఖమ్మం: మున్సిపల్ కౌంటింగ్.. కలెక్టర్ కీలక ఆదేశాలు

image

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. కేంద్రాల్లో 100% వెబ్ క్యాస్టింగ్, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని, అధికారులు ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తించాలన్నారు.

News February 12, 2026

ఖమ్మం ఆసుపత్రికి మహర్దశ.. కలెక్టర్ చొరవతో కొత్త రోడ్లు

image

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో దశాబ్దం కాలంగా అధ్వానంగా ఉన్న అంతర్గత రోడ్లకు మోక్షం లభించింది. కలెక్టర్ ఆదేశాలతో కార్పొరేషన్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. రోడ్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, టాయిలెట్ల మరమ్మతులు, సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టనున్నారు. దీనివల్ల నిత్యం ఆసుపత్రికి వచ్చే 5 వేల మంది రోగులు, సిబ్బందికి దుమ్ము, ధూళి సమస్యల నుంచి విముక్తి కలగనుంది.