News January 3, 2025
ఖమ్మం: కొలిక్కివచ్చిన ‘ఇందిరమ్మ’ దరఖాస్తుల పరిశీలన
ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్ల కోసం అందిన దరఖాస్తుల పరిశీలన ఉమ్మడి జిల్లాలో ఓ కొలిక్కి వచ్చింది. వారం రోజుల్లో దరఖాస్తుల సర్వే పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో 83.96 శాతం ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 70 శాతం మేర సర్వే పూర్తి కాగా ఎంపీడీవోలు సూపర్ చెకింగ్ చేస్తున్నారు. ఒక్కో మండలంలో కనీసం ఐదు శాతం దరఖాస్తులను వీరు పరిశీలించి అర్హులను నిర్ధారించనున్నారు.
Similar News
News January 5, 2025
చండ్రుగొండ: టెన్త్ విద్యార్థి మృతి
పురుగు మందు తాగి టెన్త్ విద్యార్థి మృతి చెందిన ఘటన జూలూరుపాడు మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బాల్యతండాకు చెందిన చరన్ ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాడు. జనవరి 1న కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఇంటికి వచ్చాడు. తిరిగి వెళ్లలేదని కుటుంబ సభ్యులు మందలించగా.. చరణ్ పురుగు మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ పాపారావు కేసు నమోదు చేశారు.
News January 5, 2025
చైనా మాంజా అమ్మొద్దు: సీపీ సునీల్ దత్
ప్రజలు, పక్షుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న చైనా మాంజా అమ్మినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ ఆదేశించారు. ఎస్‌హెచ్ఓలు తనిఖీలు చేపట్టి షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రజలు సైతం ఈ మాంజా వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించామన్నారు.
News January 4, 2025
వామనావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రాముడు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి శనివారం వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని బేడా మండపానికి మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల కోలాహలం నడుమ ఆలయం నుంచి మిథిలా స్టేడియానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు.