News April 1, 2025
ఖమ్మం: కోట మైసమ్మ తల్లిని దర్శించుకున్న అసిస్టెంట్ కమిషనర్

కామేపల్లి మండలం కొత్తలింగాల కోటమై సమ్మ దేవాలయంలో అమ్మవారిని ఖమ్మం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీర స్వామి సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిషనర్‌కు ఈవో నల్లమోతు శేషయ్య, జూనియర్ అసిస్టెంట్ బి.వరప్రసాద్, అర్చకులు బాచి మంచి పుల్లయ్య శర్మ సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. భక్తులు, గ్రామస్థులు విరివిగా పాల్గొన్నారు.
Similar News
News January 6, 2026
కల్లూరు: హోదా పెరిగినా.. వృత్తిని వదలని సర్పంచ్

పదవి వచ్చినా పాత వృత్తిని వదలక ఆదర్శంగా నిలుస్తున్నారు కల్లూరు మండలం తెలగవరం సర్పంచ్ యల్లమందల విజయలక్ష్మి. స్వయం సహాయక సంఘ సభ్యురాలైన ఆమె, కుటుంబ పోషణ కోసం ఇంటి వద్దే కారం, పిండి మిల్లు నడుపుతున్నారు. సర్పంచిగా ఎన్నికైన తర్వాత కూడా ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా, తన వృత్తిని కొనసాగిస్తూనే గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. శ్రమను నమ్ముకున్న ఆమె తీరును చూసి స్థానికులు ప్రశంసిస్తున్నారు.
News January 6, 2026
నేటి నుంచే విద్యుత్ ‘ప్రజా బాట’

విద్యుత్ వినియోగదారుల సమస్యల తక్షణ పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా బాట’ కార్యక్రమం జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 8 గంటల నుంచి మండలాల వారీగా ఈ శిబిరాలు నిర్వహిస్తామని ఎస్‌ఈ శ్రీనివాసాచారి తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బంది, జిల్లా అధికారులు అందుబాటులో ఉండి ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరిస్తారన్నారు.
News January 6, 2026
ఖమ్మం : విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన.. ఉపాధ్యాయుడి తొలగింపు

విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నర్సింహులగూడెం పాఠశాలలో పనిచేస్తున్న జి.వీరయ్యను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది అక్టోబరులో ఇతనిపై పోక్సో కేసు నమోదు కావడంతో పాటు సస్పెన్షన్ వేటు పడింది. సమగ్ర విచారణ అనంతరం నివేదిక ఆధారంగా డీఈఓ ఈ బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నారు.


