News November 16, 2025

ఖమ్మం: ‘క్యాంపెయిన్ 5.0’తో స్కూళ్లపై ఉన్నతాధికారుల దృష్టి

image

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో విద్యాశాఖ ‘స్పెషల్ క్యాంపెయిన్ 5.0’ తనిఖీలను చేపట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపటి నుంచి 22వ తేదీ వరకు ఉన్నతాధికారులు ముమ్మరంగా పర్యవేక్షించనున్నారు. పాఠశాలల్లో కనీస వసతులు, పరిశుభ్రత, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ పర్యవేక్షణకు ఖమ్మంకు శ్రీనివాసాచారి, కొత్తగూడెంకు వెంకటనర్సమ్మలు ఇన్చార్జ్‌లుగా వ్యవహరిస్తారు.

Similar News

News November 16, 2025

KNR: NH-563లో ఇదేం ఇంజినీరింగ్..?

image

NH-563 ఫోర్ లైన్ నిర్మాణంలో ప్రణాళిక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా గ్రామాల వద్ద అండర్ పాస్‌లు గుర్తించకపోవడం, దీంతో ప్రజలు ఆందోళనలకు దిగడంతో ఇంజినీరింగ్ లోపాలు బయటపడ్డాయి. ఈ కారణంగా ప్లాన్ మార్చాల్సిన పరిస్థితి రావడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. 68 కి.మీ.ల రోడ్డు నిర్మాణంలో 9 మేజర్ బ్రిడ్జిలు, 20 మైనర్ బ్రిడ్జిలు, 189 కల్వర్టులు, 51 జంక్షన్లు నిర్మించాల్సి ఉందని అధికారులు తెలిపారు.

News November 16, 2025

సౌతాఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

image

కోల్‌కతాలో టీమ్ ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో సౌతాఫ్రికా 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బవుమా 55* పరుగులతో రాణించారు. జడేజా 4, కుల్దీప్, సిరాజ్ చెరో 2, బుమ్రా, అక్షర్ ఒక్కో వికెట్ తీశారు. ఈ టెస్టులో భారత్ గెలవాలంటే 124 రన్స్ చేయాలి.

News November 16, 2025

తంగళ్ళపల్లి: గుర్తుపడితే సమాచారం ఇవ్వాలి: ఎస్‌ఐ

image

మృతుడిని గుర్తుపడితే సమాచారం ఇవ్వాలని తంగళ్ళపల్లి ఎస్‌ఐ ఉపేంద్ర చారి తెలిపారు. తంగళ్ళపల్లిలోని మానేరువాగులో ఆదివారం ఉదయం గుర్తుతెలియని శవం లభ్యమైందన్నారు. సుమారు అతని వయసు 40–50 సంవత్సరాలు ఉంటుదన్నారు. 5.3 ఫీట్ల ఎత్తు, కోలముఖం, బూడిద కలర్ పాయింట్, మెరూన్ కలర్ జర్కిని ధరించి ఉన్నాడన్నారు. మృతున్ని ఎవరైనా గుర్తుపడితే 8712656370 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.