News August 15, 2025
ఖమ్మం: ‘గణేష్ నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు’

జిల్లాలో గణేష్ నిమజ్జనం జరిపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. మున్నేరు నదిలో వినాయక నిమజ్జనం పాయింట్లుగా ఏర్పాటు చేయుటకు పెద్దతండ, ప్రకాష్ నగర్ వద్ద ప్రాంతాలను అదనపు కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. గణేష్ నిమజ్జన పాయింట్ల వద్ద అవసరమైన మేరకు భారీ క్రేన్లు, లైటింగ్ ఏర్పాట్లు, సీసీటీవీ ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
Similar News
News August 16, 2025
ఖమ్మం జిల్లాలో 579.9 MM వర్షపాతం నమోదు

ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో మొత్తం 579.9 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. కొనిజర్లలో అత్యధికంగా 70.9 మి.మీ, ఎర్రుపాలెం మండలంలో అసలు వర్షపాతం నమోదు కాలేదని సింగరేణి 61.4 మి.మీ, వైరా 55.4 మి.మీ, కుసుమాంచి 47.8 మి.మీ, కామేపల్లి 46.7 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News August 16, 2025
నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలి: ఖమ్మం అ.కలెక్టర్

పాలేరు రిజర్వాయర్‌లో నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం పాలేరు రిజర్వాయర్‌ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజర్వాయర్‌లో ఉన్న నీటి నిల్వ, ఇన్ ఫ్లో ఎంత, ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఎంత, తదితర వివరాలను నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఆరా తీశారు.
News August 16, 2025
ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న అదనపు కలెక్టర్

ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డాక్టర్ పి.శ్రీజ ఉత్తమ సేవా అవార్డును అందుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మం పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కలెక్టర్ అనుదీప్ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం అందుకున్నారు. క్షేత్రస్థాయిలో వివిధ శాఖల ఉద్యోగుల కృషి, సహకారం వల్లనే ఈ పురస్కారం పొందానని సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.