News March 15, 2025
ఖమ్మం: గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి

నిత్యం వార్తా పత్రికలు చేరవేస్తున్న వ్యక్తి.. గుర్తు తెలియని వాహనం ఢీకొని మరణించడంతో వార్తలో నిలిచిన ఘటన చింతకాని మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంకు చెందిన రాజుల అనిల్ అనే వ్యక్తి డైలీ న్యూస్ పేపర్స్‌ను ఆటోలో చేరవేస్తుంటాడు. ఈ క్రమంలో వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
Similar News
News December 2, 2025
IPLకు మరో స్టార్ ప్లేయర్ దూరం!

ఐపీఎల్-2026కు మరో స్టార్ ప్లేయర్ దూరమైనట్లు తెలుస్తోంది. ఈ నెలలో జరిగే మినీ వేలం కోసం ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రిజిస్టర్ చేసుకోలేదని సమాచారం. గత సీజన్‌లో మ్యాక్సీ పంజాబ్ తరఫున ఆడగా తిరిగి రిటైన్ చేసుకోని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వచ్చే సీజన్ ఆడేది అనుమానమేనని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే డుప్లెసిస్, రసెల్ వంటి స్టార్లు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
News December 2, 2025
మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

మెంతులను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలుంటాయని తెలిసిందే. కానీ గర్భిణులు వీటిని తీసుకోవడం వల్ల కొన్నిసార్లు అబార్షన్ కావడం, పుట్టే బిడ్డలో మాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ అనే జన్యు సంబంధిత సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్‌లలో ఈస్ట్రోజెన్ ఆధారిత కణితులను ఇది మరింత ప్రేరేపిస్తుందంటున్నారు. కాబట్టి వీటిని వాడేముందు వైద్యుల సలహా తప్పనిసరి అని సూచిస్తున్నారు.
News December 2, 2025
ములుగు: ఎస్సై హరీశ్ మృతి.. నేటికి ఏడాది!

ములుగు జిల్లా వాజేడు ఎస్సైగా పని చేసిన రుద్రారపు హరీశ్ బలవన్మరణానికి పాల్పడిన ఘటనకు నేటికీ ఏడాది. డిసెంబర్ 2న ఆయన ముళ్లకట్ట వద్దనున్న రిసార్టులో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తన మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని, మృతి చెందిన సమయంలో తనతో యువతి సైతం రీసార్ట్‌లో పక్కనే ఉండడం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.


