News August 24, 2024

ఖమ్మం: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి

image

ఖమ్మం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికలు వాయిదా పడతాయని భావిస్తున్న తరుణంలో పంచాయతీ ఓటర్ల ముసాయిదా షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ మద్దతుదారులతో పాటు వనరుల సమీకరణలో నిమగ్నమయ్యారు. ఖమ్మం జిల్లాలో 589 గ్రామ పంచాయతీల్లోని 5389 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది.

Similar News

News October 7, 2024

దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసిన ముస్లిం దంపతులు

image

ఖమ్మం రూరల్: నాయుడుపేటలో ఏర్పాటుచేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ముస్లిం దంపతులు షేక్ సోందు- నైదాభి దర్శించుకున్నారు. అమ్మవారికి ముస్లిం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. హిందూ దేవత అయిన దుర్గమ్మకు పూజలు నిర్వహించిన ముస్లిం దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని స్థానికులు తెలిపారు. కాగా షేక్ సొందు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.

News October 7, 2024

సత్తుపల్లి: పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య

image

సత్తుపల్లి మండలం<<14289034>> రేగళ్లపాడుకి చెందిన సైద్‌పాషా సూసైడ్ <<>>చేసుకున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. పాషా స్నేహితుడు ఖాసుబాబు వారం కిందట పాషా సెల్‌ఫోన్ నుంచి ఓ వివాహితకు కాల్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆ వివాహిత తన భర్తకి ఈ విషయం తెలియడంతో పాషా షాప్ దగ్గరకు వచ్చి అతడిపై దాడి చేశాడు. తాను చేయని తప్పుకు శిక్ష అనుభవించానని అవమానంగా భావించిన పాషా సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 7, 2024

న్యూజిలాండ్‌లో కొత్తగూడెం యువతికి మొదటి బహుమతి

image

న్యూజిలాండ్‌ ఆక్లాండ్‌లోని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో బతుకమ్మ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో కొత్తగూడెం త్రీ ఇంక్లైన్ కార్మిక ప్రాంతానికి చెందిన చంద్రగిరి రేఖ పేర్చిన బతుకమ్మకి మొదటి బహుమతి లభించింది. న్యూజిలాండ్‌లో స్థిరపడిన తెలంగాణ చెందిన మహిళ కుటుంబాలలు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు.