News January 22, 2026
ఖమ్మం: గ్రామ పారిశుద్ధ్యం, రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ సమీక్ష

ప్రజలకు సత్వర న్యాయం అందేలా అధికారులు మెరుగైన సేవలు అందించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో తహశీల్దార్లు, ఎంపీడీవోలతో గ్రామ పారిశుద్ధ్యం, రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్ రెవెన్యూ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News February 6, 2026
ఖమ్మం SC స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం SCస్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 5నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంచాలకులు వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రూప్స్, రైల్వే, బ్యాంకింగ్ వంటి పరీక్షలకు సిద్ధమయ్యే వారికి శిక్షణ దోహదపడుతుందని పేర్కొన్నారు. ఎంపికైన 100మందికి ఉచిత భోజన, వసతి కల్పిస్తామన్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి, వార్షిక ఆదాయం రూ. 3 లక్షలలోపు ఉన్న వారు ఈ నెల22లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News February 6, 2026
రేపటితో పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు ముగింపు

మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కలెక్టర్ అనుదీప్ సూచనలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కోరుకునే వారు ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించారు. అభ్యర్థులు ఫారమ్-12తో పాటు డ్యూటీ ఆర్డర్, ఎపిక్ కార్డు నకళ్లను సంబంధిత మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారు 8న తమ ఓటును నమోదు చేసుకోవాలన్నారు.
News February 6, 2026
రేపే నవోదయ ప్రవేశ పరీక్ష

పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11తరగతుల్లో ప్రవేశాల కోసం శనివారం పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 9వ తరగతి ప్రవేశానికి 505 మంది, 11వ తరగతికి 797 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష ఉదయం 11:15 గంటల నుంచి మధ్యాహ్నం 1:45 గంటల వరకు జరుగుతుందని ప్రిన్సిపల్ తెలిపారు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.


