News January 19, 2026

ఖమ్మం: ‘గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పనిచేయాలి’

image

సర్పంచ్ పదవిని కేవలం హోదాగా కాకుండా ఒక బాధ్యతగా భావించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నిర్వహించిన శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు, పచ్చదనం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకూ చేరేలా సర్పంచులు క్రియాశీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు.

Similar News

News February 9, 2026

ఖమ్మం: ‘జిల్లా జైలుకు కుళ్లిన మటన్’.. నిజమెంత..?

image

ఖమ్మం జిల్లా జైలుకు కుళ్లిన మటన్ సరఫరా అవుతోందన్న వార్తలను జైలు సూపరింటెండెంట్ శ్రీధర్ ఖండించారు. దీనిపై జరుగుతోన్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఆయన స్పష్టం చేశారు. జైలుకు వరంగల్‌కు చెందిన అప్రూవ్డ్ కాంట్రాక్టర్ ద్వారానే మాంసం సరఫరా అవుతుందని, ఖమ్మం స్థానిక షాపుల నుంచి కాదన్నారు. నెలలో ఒకసారి మాత్రమే ఖైదీలకు మటన్ పెడతామని, అది కూడా జైలు వైద్యుల తనిఖీ తర్వాతే వండుతామని ఆయన వివరణిచ్చారు.

News February 9, 2026

ఖమ్మం: రైతులకు ముఖ్య గమనిక.. FEB 20 చివరితేదీ

image

ప్రస్తుత పంట సం. 2025- 26లో కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోలుకు ఈనెల 20ని చివరి తేదీగా సీసీఐ నిర్ణయించినట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పత్తి రైతులలో ఇంకా ఎవరైనా సీసీఐకి మద్దతు ధరపై పత్తి అమ్ముకునేందుకు ఉంచినట్లయితే FEB 20లోగా తీసుకొని రావాలని సూచించారు. పత్తిని విక్రయించడానికి కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్‌ను బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

News February 9, 2026

‘ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే మెరుగైన జీవనం’

image

ప్రారంభదశలో క్యాన్సర్‌ను గుర్తించి చికిత్స తీసుకుంటే మెరుగైన జీవనం పొందవచ్చని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్లో ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వస్థ్ మహిళా-స్వస్థ్ భారత్ ప్రోగ్రాంలో ఆయన అదనపు కలెక్టర్లతో పాల్గొన్నారు. క్యాన్సర్‌ను ఆలస్యంగా గుర్తించి చికిత్స పొంది బతికినప్పటికీ లైఫ్ స్టైల్‌లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. మహిళా ఉద్యోగులకు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలని సూచించారు.