News January 13, 2026
ఖమ్మం: చికెన్ ధరకు రెక్కలు.. సామాన్యుడికి ‘ముక్క’ కష్టమే!

ఉమ్మడి ఖమ్మంలో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నెల క్రితం రూ. 250 ఉన్న స్కిన్‌లెస్ కిలో ధర ప్రస్తుతం రూ. 350కి చేరింది. సంక్రాంతి పండుగ, శుభకార్యాల సీజన్‌తో డిమాండ్ పెరగడం, చలి తీవ్రతకు ఉత్పత్తి తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. లైవ్ కోడి ధర కూడా రూ. 180 మార్కును దాటింది. రానున్న మేడారం జాతర నాటికి ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో మాంసప్రియులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News February 21, 2026
మెటర్నిటీ లీవ్ గురించి తెలుసా?

మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం, పని చేసే మహిళలకు గర్భం దాల్చిన సమయంలో ప్రత్యేకహక్కులు ఉన్నాయి. మొదటి ఇద్దరు పిల్లలకు 26 వారాల పెయిడ్ లీవ్స్ అందించాలి. తదుపరి పిల్లలకు 12 వారాల పెయిడ్ లీవ్స్ ఇవ్వాలి. మూడు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న బిడ్డను దత్తత తీసుకున్నప్పుడు లేదా సరోగసీ పేరెంట్స్ కూడా 12 వారాల సెలవు పొందవచ్చు. ఈ లీవ్స్ తీసుకున్నందుకు కంపెనీలు మహిళలను ఉద్యోగం నుంచి తొలగించలేవు.
News February 21, 2026
ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ నరసింహ

ఇంటర్ పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థి సమయానికి పరీక్షలకు హాజరై, చక్కగా పరీక్షలు రాసి, విజయం సాధించాలని తూ.గో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ శనివారం సూచించారు. త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ & సోలార్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.
News February 21, 2026
ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు: సంగారెడ్డి డీఈవో

సంగారెడ్డి జిల్లాలోని అన్ని స్కూల్స్‌లో 1 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏప్రిల్ 10 నుంచి 20 వరకు ఎస్ఎ-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాల విద్యాశాఖ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసిందన్నారు. ఈ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు.


