News November 19, 2025
ఖమ్మం: చిరుత సంచారం.. రైతుల భయాందోళన

ముదిగొండ మండలం గంధసిరి గ్రామం నక్కల వాగు, బైండ్ బండ ఏరియాలో మంగళవారం సాయంత్రం చిరుత పులి సంచారం కలకలం సృష్టించింది. పులిని చూశామని స్థానిక వ్యవసాయదారులు దారగాని రమణమ్మ, దారగాని తిరుపయ్య చెప్పగా, రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు బుధవారం ఉదయం గ్రామానికి చేరుకుని, చిరుత సంచరించిన ప్రదేశాలలో పాదముద్రలను పరిశీలిస్తున్నారు.
Similar News
News November 20, 2025
HYD: మీసం తిప్పే వయసులో.. మత్తుకు చిత్తు

మీసం తిప్పే వయసులో యువత మత్తుకు చిత్తవుతున్నారు. ఇదే ఆసరాగా యువతకు డబ్బు ఆశ చూపి, వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. అనేక డ్రగ్స్ కేసుల్లో యువకులు రవాణాదారులుగా ఉండటం కలవరపెడుతోంది. HYDలో గత ఆరేళ్లలో సుమారు 1,000 మందికిపైగా 12- 18 ఏళ్లవారే కేసుల్లో చిక్కకున్నట్లు తెలుస్తోంది. యుక్త వయసులో నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. సోషల్ మీడియా వీడియోల ప్రభావం సైతం ఉందని తేలింది.
News November 20, 2025
పత్తిని గులాబీ రంగు పురుగు ఆశించకుండా ముందస్తు జాగ్రత్తలు

పత్తిని వేసవి పంటగా డిసెంబర్ తర్వాత సాగు చేయకూడదు. పంట మార్పిడి పద్ధతిని తప్పక పాటించాలి. లింగాకర్షక బుట్టలను పెట్టి పురుగు ఉద్ధృతిని గమనిస్తుండాలి. ఎండాకాలంలో లోతు దుక్కులు చేస్తే గులాబీ పురుగు కోశస్థ దశలను నాశనం చేయవచ్చు. తక్కువ పంట కాలం రకాలను ఎంచుకొని సకాలంలో విత్తుకోవాలి. పొలం చుట్టూ B.T విత్తనాలతో సహా ఇచ్చిన నాన్ B.T విత్తనాలు విత్తుకోవాలి. ఈ పురుగు ఆశించిన పంట విత్తనాలను నిల్వ చేయకూడదు.
News November 20, 2025
150 పోస్టులకు TCIL నోటిఫికేషన్

టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (TCIL)150 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ITI, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫారమ్‌ను tcilksa@tcil.net.inకు, tcilksahr@gmail.com ఇ మెయిల్ ద్వారా పంపాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.tcil.net.in/


