News February 24, 2026

ఖమ్మం చెంతకు ‘కలియుగ వైకుంఠం’..!

image

ఖమ్మం ధంసలాపురంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఆలయంతో పాటు వసతి గృహాలు, కళ్యాణ మండపాలు నిర్మించనున్నారు. ఈ నిర్ణయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని, త్వరలోనే నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని తుమ్మల వెల్లడించారు.

Similar News

News February 24, 2026

అనకాపల్లి జిల్లాలో శత శాతం అక్షరాస్యత సాధించాలి: కలెక్టర్

image

అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో శత శాతం అక్షరాస్యత సాధించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో అక్షరాంధ్ర కార్యక్రమంపై సమీక్షించారు. 93,056 మంది నిరక్షరాస్యలను గుర్తించామన్నారు వీరికి చదువు చెప్పేందుకు 9,351 మంది వాలంటీర్లను నియమించామన్నారు. చదవడం రాయడం లెక్కలు చేయడం నేర్పించాలన్నారు. ఈనెల 28న ఫ్రీ ఫైనల్ అంచనా పరీక్ష నిర్వహిస్తామన్నారు.

News February 24, 2026

నేడు ఆర్టీసీ కార్మికుల ‘చలో సెక్రటేరియట్’..

image

తమ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో, ఆర్టీసీ కార్మికులు మంగళవారం ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక జేఏసీ ఈ పోరాటాన్ని చేపట్టింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చేలా జేఏసీ ఏర్పాట్లు పూర్తి చేసింది.

News February 24, 2026

NLG: రైస్ మిల్లర్లపై పోలీసు కేసుల కలకలం!

image

జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ ఎగ్గొట్టిన రైస్ మిల్లర్లపై సివిల్ సప్లై అధికారులు కన్నెర్ర చేశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా అక్రమాలకు పాల్పడిన పలువురు మిల్లర్లపై రెండు రోజుల నుంచి వరుసగా కేసులు నమోదు చేయించడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. బియ్యం మాయం చేసినట్లు గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వెనువెంటనే ఎఫ్.ఐ.ఆర్‌లు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.