News December 2, 2025
ఖమ్మం: చెక్ బౌన్స్.. ఏడాది జైలు, రూ.19 లక్షల పరిహారం

ఖమ్మం నర్తకి థియేటర్ ప్రాంతానికి చెందిన ఎ.రవిబాబుకి చెల్లని చెక్కు కేసులో ఖమ్మం రెండో అదనపు కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందు ఏడాది జైలు శిక్షతో పాటు ఫిర్యాదుదారుడికి రూ.19 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సోమవారం తీర్పు చెప్పారు. 2014లో రూ.15 లక్షల అప్పు తీసుకున్న నిందితుడు, 2016లో రూ.19 లక్షల చెక్కు జారీ చేయగా ఖాతాలో సరైన నగదు లేకపోవడంతో కోర్టులో కేసు దాఖలు చేయగా పైవిధంగా తీర్పునిచ్చారు.
Similar News
News December 3, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

➤కోటబొమ్మాళిలో జేసీ ఆకస్మిక తనిఖీ
➤పాతపట్నం: లగేజీ ఆటో బోల్తా.. బాలుడికి గాయాలు
➤మనుషుల నుండి Scrub Typhus వ్యాపించదు: DMHO
➤శ్రీకాకుళం: ప్రజా ఉద్యమంపై ఉక్కుపాదం వద్దు
➤రైతుసేవలో కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే బగ్గు
➤మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే శిరీష
➤మందస: నరకాన్ని తలపిస్తున్న రహదారులు
News December 3, 2025
తొర్రూరు నుంచి శబరిమలైకి ప్రత్యేక బస్సు

అయ్యప్ప మాల ధరించిన స్వాములకు టీజీఎస్‌ఆర్‌టీసీ శుభవార్త చెప్పింది. ఈనెల 17న తొర్రూరు నుంచి శబరిమలైకి ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వి.పద్మావతి తెలిపారు. ఈ బస్సు శ్రీశైలం, మహానంది, అహోబిలం, పళని, గురువాయూర్, అయ్యప్ప సన్నిధానం, త్రివేండ్రం, రామేశ్వరం, మధురై, శ్రీరంగం వంటి పుణ్యక్షేత్రాలను కలుపుతూ వెళ్తుందని బుధవారం ఆమె ప్రకటనలో పేర్కొన్నారు.
News December 3, 2025
దేవరకొండ: బురఖా ధరించి వృద్ధురాలిపై రోకలితో దాడి

దేవరకొండ, గాంధీనగర్‌లో బురఖా ధరించి ఇంట్లోకి ప్రవేశించిన ఓ మహిళ వృద్ధురాలు కొండోజు భాగ్యమ్మపై రోకలితో దారుణంగా దాడి చేసింది. కోడలి స్నేహితురాలినని చెప్పి లోపలికి వచ్చి క్రూరంగా కొట్టింది. కేకలు విని స్థానికులు రాగా, ఆమె పారిపోయింది. గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల క్రితం ఇంట్లోంచి మాయమైన రోకలితోనే దాడి జరగడం సంచలనం సృష్టించింది.


