News September 3, 2025
ఖమ్మం: చేపపిల్లల టెండర్ల దాఖలు గడువు పొడిగింపు

ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది 882 జలాశయాల్లో 3.49కోట్ల చేపపిల్లలు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి టెండర్ల దరఖాస్తు కోసం ఆహ్వానించిన విషయం తెలిసింది. అయితే జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నాటికి మూడు టెండర్లు నమోదైనట్లు సమాచారం. దీంతో గడువును ఈనెల 8వ తేదీ వరకు పెంచారు. ఆపై టెండర్లను ఖరారు చేశాక చేప పిల్లల పంపిణీ చేయనున్నారు.
Similar News
News September 5, 2025
ఖమ్మం జిల్లా నిరుద్యోగ యువతకు శుభవార్త

జిల్లాలోని నిరుద్యోగ యువతకు RSETI ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జూట్ బ్యాగ్ ప్రిపరేషన్, పుట్టగొడుగుల పెంపకం, సీసీ కెమెరా ఇన్‌స్టాలేషన్ వంటి కోర్సులలో శిక్షణ అందిస్తారు. శిక్షణతో పాటు భోజనం, వసతి సౌకర్యాలను కూడా ఉచితంగా కల్పిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని సంస్థ కార్యాలయంలో ఈ నెల 10వ తేదీలోపు తమ దరఖాస్తులను సమర్పించాలని సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ కోరారు.
News September 5, 2025
ఖమ్మం: పాఠశాలల్లో క్రీడల ప్రోత్సాహంపై కలెక్టర్ సమీక్ష

ఖమ్మం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పీఈటీ కోచ్‌లతో సమీక్ష నిర్వహించారు. ప్రతి విద్యార్థి వారానికి 150 నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ చేయడం తప్పనిసరి చేయాలని సూచించారు. క్లస్టర్, మండల స్థాయిల్లో పోటీలు నిర్వహించి ప్రతిభావంతులను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలల్లో స్పోర్ట్స్ కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంచాలని సూచించారు.
News September 4, 2025
నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు: ఖమ్మం సీపీ

గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో (సెప్టెంబర్-6) శనివారం వాహనదారులు గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర జరిగే రూట్లు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్నారు.