News January 8, 2026
ఖమ్మం: చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తున్నారా?.. తస్మాత్ జాగ్రత్త.!

సోషల్ మీడియాలో చిన్న పిల్లల అశ్లీల(చైల్డ్ పోర్నోగ్రఫీ) వీడియోలను చూస్తూ, ఇతరులకు షేర్ చేస్తున్న వ్యక్తిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వి.నిరంజన్ కుమార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియాపై నిరంతర నిఘా ఉంటుందని సీపీ హెచ్చరించారు.
Similar News
News January 30, 2026
సంగారెడ్డి: ఎన్నికల ఖర్చుపై నిఘా.!

మున్సిపల్ ఎన్నికల ప్రచార ఖర్చులపై నిశితంగా నిఘా ఉంచాలని వ్యయ పరిశీలకులు రాకేష్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం పంపిణీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. భారీ నగదు లావాదేవీలు, అనుమానాస్పద వస్తువుల సరఫరాపై నిరంతరం నిఘా ఉంచాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News January 30, 2026
ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100% గ్రాస్ శాలరీ

AP: వైద్యారోగ్య శాఖలో నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగుల్లో రెగ్యులరైన 1560 మందికి 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలని ప్రభుత్వం GO ఇచ్చింది. టైమ్ స్కేల్ అమలుతో వీరి జీతాలు 2023 SEP-2024 MAR మధ్య తగ్గాయి. అయితే కోర్టు తీర్పు ఇతర కారణాలతో వారికి పూర్తి వేతనం ఇవ్వడంతోపాటు అరియర్స్ చెల్లించాలని తాజాగా నిర్ణయించింది. జీతాలకు ఏటా ₹21,51,36,724 అదనపు భారం GOVTపై పడుతుంది. అరియర్ల కింద ₹16,45,41,361 చెల్లించనుంది.
News January 30, 2026
‘హౌసింగ్ కార్పొరేషన్’ పునరుద్ధరణ… డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ బదిలీ

TG: గత BRS ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్‌ను ఎత్తేసి సిబ్బందిని R&Bలో విలీనం చేసింది. కీలకమైన డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని ఆ శాఖకు అప్పగించింది. అప్పట్నుంచీ నిర్మాణాలను ఆ శాఖే చేపడుతోంది. అయితే స్కీమ్‌ను స్పీడప్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్‌ను తిరిగి కొనసాగించేలా చర్యలు చేపట్టింది. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. డబుల్ బెడ్ రూమ్ స్కీమ్‌ను R&B నుంచి ఆ సంస్థకు అప్పగించింది.


