News March 20, 2025
ఖమ్మం: జర్నలిస్టుల కోసం ప్రత్యేక డ్రైవ్: అ.కలెక్టర్

ఖమ్మంలో నేటి నుంచి మూడు రోజుల పాటు జర్నలిస్టుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్‌లోని మీ సేవ ద్వారా జర్నలిస్టులు రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలని సూచించారు. అప్లై తరువాత రేషన్ కార్డులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జర్నలిస్టులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News March 20, 2025
వ్యాపారవేత్త ఆలోచనతో మహిళలు ముందుకు సాగాలి: కలెక్టర్

ఖమ్మం: సమాజంలో సమానత్వం రావాలంటే మహిళలు అన్ని రంగాలలో నైపుణ్య వ్యాపారం చేస్తూ ఆర్థిక బలం సాధిస్తే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం పెనుబల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో ఉన్న మండల మహిళా సమాఖ్య భవనంలో ఉషోదయ, ఆదర్శ మహిళా సమాఖ్యలతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. వ్యాపారవేత్త ఆలోచనా ధోరణితో మహిళలు ముందుకు సాగాలని పేర్కొన్నారు.
News March 20, 2025
ఖమ్మం: పదో తరగతి పరీక్షలకు వేళాయే!

ఖమ్మం జిల్లాలో టెన్త్ పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 97 పరీక్ష కేంద్రాల్లో 16,788 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. CC కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు DEO సోమశేఖర్ శర్మ చెప్పారు. 6 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 97 సిట్టింగ్ స్క్వాడ్స్, 97 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 98 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 1595 మందిని ఇన్విజిలేటర్లుగా విధులు కేటాయించారు.
News March 20, 2025
టేకులపల్లి: బాలికపై అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం సంపత్ నగర్ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల హాస్టల్ డిప్యూటీ వార్డెన్ ప్రతాప్ సింగ్ మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించగా, విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో కుటుంబ సభ్యులు, యువకులు దేహశుద్ధి చేశారు. అనంతరం బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పొడిశెట్టి శ్రీకాంత్ తెలిపారు.