News November 25, 2025
ఖమ్మం జిల్లాకు3,107 టన్నుల యూరియా

ఖమ్మం జిల్లాకు యూరియా, కాంప్లెక్స్ ఎరువుల పంపిణీని చింతకాని మండలం పందిళ్లపల్లి ర్యాక్ పాయింట్‌లో టెక్నికల్ ఏవో పవన్ కుమార్ పరిశీలించారు. ర్యాక్ పాయింట్‌కు మొత్తం 3107.16 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. ఇందులో ఖమ్మం (1517 MT), భద్రాద్రి (500 MT) కేటాయించారు. రైతులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Similar News
News November 25, 2025
పెద్దపల్లి: ‘డిసెంబర్ 31లోపు దరఖాస్తులు సమర్పించాలి’

స్కాలర్షిప్ దరఖాస్తులు డిసెంబర్ 31లోపు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం పెండింగ్ ఎస్సీ విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులపై సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్, హెచ్‌డబ్ల్యూఓలు, సంబంధిత అధికారులు ఉన్నారు.
News November 25, 2025
సర్పంచి రిజర్వేషన్లు.. జిల్లెల్లలో ఆశలు- నిరాశలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నవంబర్ 23న నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో తంగళ్లపల్లి మండలంలో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా జిల్లెల్ల గ్రామంలోని నాలుగు కూడళ్లలో, టీ స్టాళ్ల వద్ద పంచాయతీ ఎన్నికలపై చర్చలు మరింత జోరందుకున్నాయి. పీఠం ఎవరికి దక్కుతుందన్న ఊహాగానాలు వేగంగా మారుతుండగా, రిజర్వేషన్ కారణంగా కొందరు ఆశావహులు నిరాశకు గురవుతున్నారు.
News November 25, 2025
NTR: జోగి రమేష్‌కి రిమాండ్ పొడిగింపు

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము, అద్దేపల్లి జనార్దనావుతో సహా ఏడుగురు నిందితులకు విజయవాడ ఎక్సైజ్ కోర్టు మంగళవారం రిమాండ్ పొడిగించింది. రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరచగా, డిసెంబర్ 9 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


