News March 20, 2024
ఖమ్మం జిల్లాపై ప్రత్యేక నిఘా..

ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యేక నిఘా బృందాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. డబ్బు అక్రమ రవాణా, మద్యం పంపిణీకి అడ్డుకట్ట వేసేలా పోలీసులు చర్యలు చేపట్టారు. భద్రాద్రి జిల్లాలో రెండు, ఖమ్మం జిల్లా పరిధిలో పది అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 15 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు, 15 స్టాటిస్టికల్ సర్వైలెన్స్ బృందాలు, 5 అకౌంటింగ్ బృందాలను నియమించారు.
Similar News
News February 20, 2026
ఖమ్మం: అడ్డగోలుగా అబార్షన్ కిట్స్ అమ్మకాలు..!

ఖమ్మం జిల్లాలో డాక్టర్ రిఫరెన్స్ లేకుండా అబార్షన్ కిట్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వీటిని వాడుతున్న మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఏడాదిలో 50 వేల కిట్స్ అమ్ముడయ్యాయి. షెడ్యూల్-H కిందకి వచ్చే మీసో ప్రోస్టల్ మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మొద్దు. ఇలాంటి మెడికల్ షాపులపై డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని DI అనిల్ తెలిపారు.
News February 20, 2026
ఖమ్మం: ఎస్సీ స్టడీ సర్కిల్ దరఖాస్తులకు 22 చివరి తేదీ

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో నిరుద్యోగులకు అందించే 5 నెలల ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు ఈ నెల 22న ముగియనుందని డైరెక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు తెలిపారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి శిక్షణ కోసం మార్చి 1న ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.