News January 4, 2026
ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఓటర్ల జాబితా ఇదే.!

☆ మధిర 22 వార్డుల్లో మొత్తం ఓటర్లు 25,679 ఉండగా.. పురుషులు-12251 మహిళలు-13,424 ఇతరులు-4, ☆సత్తుపల్లి 23 వార్డుల్లో మొత్తం ఓటర్లు 28,411.. ఇందులో పురుషులు-13,426 మహిళలు-14,970 ఇతరులు-15, ☆వైరా(20) మొత్తం ఓటర్లు 24,689 పురుషులు-11,696 మహిళలు-12,991 ఇతరులు-2 ☆ఏదులాపురం(32) మొత్తం ఓటర్లు 45,256 పురుషులు-21,742 మహిళలు-23,511 ఇతరులు-3 ☆కల్లూరు(20) మొత్తం ఓటర్లు 18,866 పురుషులు-9081, మహిళలు-9785 ఉన్నారు.
Similar News
News February 13, 2026
ధర్మంపై అధర్మమే గెలిచింది: పొంగులేటి సుధాకర్ రెడ్డి

ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో ధర్మంపై అధర్మమే విజయం సాధించిందని BJP జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో డబ్బు రాజకీయాలే పైచేయి సాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విజయం కేవలం “ధనబలంతో కూడిన రాజకీయాలదే తప్ప, ప్రజల నిజమైన తీర్పు కాదు. ప్రజలు ఈ విషయాన్ని త్వరలోనే గ్రహిస్తారు” అని అభిప్రాయపడ్డారు.
News February 13, 2026
ర్యాలీలు, సంబరాలపై నిషేధం: ఖమ్మం సీపీ సునీల్ దత్

మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, వేడుకలకు అనుమతి లేదని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్పష్టం చేశారు. కమిషనరేట్ వ్యాప్తంగా సెక్షన్ 163 BNSS అమలులో ఉన్నందున నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాణసంచా కాల్చడం, డీజేల వినియోగం, బైక్ ర్యాలీలు, బహిరంగ సభలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించినట్లు తెలిపారు.
News February 13, 2026
ఖమ్మం: భక్తులకు గమనిక

మహాశివరాత్రి పండగను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఖమ్మం ఆర్ఎం సరీరామ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తీర్థాలకు, స్థానాల లక్ష్మీపురం, నీలాద్రి, అన్నపురెడ్డి పల్లి, మోతేగడ్డ, బెండలపాడు దేవాలయాలకు స్థానిక డిపోల-79 బస్సులు రాకపోకలు సాగిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలన్నారు.


