News September 4, 2025

ఖమ్మం జిల్లాలో అక్కడే అత్యధికం.!

image

ఖమ్మం జిల్లాలో బుధవారం ఉదయం 8:30 నుంచి గురువారం ఉదయం 8:30 వరకు 46.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సత్తుపల్లిలో 20.6, వేంసూరు 6.0, నేలకొండపల్లి 4.8, చింతకాని, ఖమ్మం అర్బన్ 3.6, మధిర 3.4, బోనకల్ 2.2, ముదిగొండ 1.8, వైరా మండలంలో 0.6 నమోదైనట్లు చెప్పారు. అటు ఇతర మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.

Similar News

News September 4, 2025

నిబద్ధతతో పనిచేస్తేనే మనుగడ: ఖమ్మం అ.కలెక్టర్

image

నిబద్ధతతో పనిచేస్తేనే వ్యవస్థ మనుగడ సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన గ్రామ పాలన అధికారులతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ గురువారం సమావేశం నిర్వహించి, ఆప్షన్ ఫారంలను స్వీకరించారు. ఇటీవల నిర్వహించిన పరీక్షలో 253 మంది ఉత్తీర్ణత సాధించారని, వీరిలో 240 మంది లోకల్, 13 మంది నాన్ లోకల్ ఉన్నారని పేర్కొన్నారు.

News September 4, 2025

ఖమ్మం జిల్లాకు 307 మంది నూతన జీపీఏఓలు

image

గ్రామపాలనాధికారి పరీక్షలో ఉత్తీర్ణులైన ఖమ్మం జిల్లాకు చెందిన 307 మంది అభ్యర్థులకు ఈ నెల 5న నియామక పత్రాలు అందనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఈ పత్రాలు అందజేస్తారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఈ నియామకాలతో గ్రామస్థాయిలో పరిపాలన మరింత పటిష్టం కానుంది.

News September 4, 2025

ఖమ్మం మార్కెట్‌కు కొత్త పత్తి రాక.!

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు ఈ సీజన్ కు సంబంధించిన కొత్త పత్తి వచ్చింది. గురువారం మార్కెట్‌లో ఇవాళ్టి ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా కొత్త పత్తి ధర రూ.6,711, క్వింటా పాత పత్తి ధర రూ.7,625, ఏసీ మిర్చి ధర రూ.15,425, నాన్ ఏసీ మిర్చి ధర రూ.8,600 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. మార్కెట్లో ప్రతి ఒక్కరు నియమ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.