News March 17, 2025

ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు..!

image

∆}ఖమ్మం నగరంలో సినీ హీరో సుమన్ సందడి∆}రాజీవ్ యువ వికాసంపై Dy.CM భట్టి సమీక్ష∆} తిరుమలాయపాలెం:పురుగుమందు నీళ్లు తాగి వ్యక్తి మృతి∆} సత్తుపల్లి:సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు, జేఏసీ నేతలు∆} బోనకల్:అనుమానాస్పదంగా వివాహిత ఆత్మహత్య∆} ఖమ్మం: కారులో మంత్రి పొంగులేటి షి’కారు’∆} ఖమ్మం: అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం: మంత్రి తుమ్మల∆}ఖమ్మంలో కేటీఆర్, జగదీశ్ రెడ్డిల దిష్టిబొమ్మ దహనం

Similar News

News September 15, 2025

పటిష్టం..’పాలేరు’

image

1928లో పాలేరు చెరువు నిర్మించారు. నాటీ చీఫ్ ఇంజీనీర్ నవాబ్ ఆలీ జంగ్ బహదూర్ పర్యవేక్షణలో చతురస్రాకారం బండరాళ్లు, బంకమట్టి, డంగుసున్నం, కాంక్రీట్ లాంటి సీసంతో నిర్మించారు. చెరువు నుంచి నేటికీ చుక్క నీరు కూడా లీక్ కాకపోవడం నాటి ఇంజీనీర్ల ప్రతిభకు నిదర్శనంగా చెప్పొచ్చు. పాలేరు చెరువు 1978లో రిజర్వాయర్‌గా మారినప్పుడు ఇంజీనీర్లు ఫాలింగ్ గేట్లు ఏర్పాటు చేసి ఘనత సాధించారు. నేడు ఇంజీనీర్స్ డే.

News September 15, 2025

ఖమ్మం: ఐదేళ్ల పోరాటం.. నూతన సొసైటీ ఏర్పాటు

image

నేలకొండపల్లి మండలంలోని అప్పలనర్సింహాపురం మత్స్యపారిశ్రామిక సంఘం నూతనంగా ఏర్పాటైంది. గ్రామంలోని చెరువుకు సొసైటీ ఏర్పాటు చేసి మత్స్యకారుల అభివృద్ధికి సహకరించాలని వారు గత ఐదేళ్లుగా పోరాటం చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం మత్స్యశాఖను గుర్తించి, గ్రామానికి చెందిన 64 మందికి సభ్యత్వంను అందించారు. కొత్త సొసైటీ ఏర్పాటుపై ఆదివారం మత్స్యకారులు చెరువు వద్ద సంబురాలు నిర్వహించారు.

News September 14, 2025

‘టీజీఈ హైట్స్ ప్రాజెక్టు విజయవంతం చేయండి’

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు TGE హైట్స్ ప్రాజెక్టును విజయవంతం చేయాలని TGO రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. ఖమ్మం పోలేపల్లిలోని రాజీవ్ స్వగృహ నందు ప్రభుత్వ ఉద్యోగుల హౌస్ బిల్డింగ్ సొసైటీకి టెండర్ దక్కినందుకు సమావేశం నిర్వహించారు. CM రేవంత్, జిల్లా మంత్రుల సహకారంతో ప్రభుత్వ ఉద్యోగులకు అతి తక్కువ ధరలో గృహ సదుపాయం కల్పించాలనే సదుద్దేశంతో ఈ ప్రాజెక్టు సాధించుకున్నామన్నారు.