News August 12, 2024

ఖమ్మం జిల్లాలో టూరిజానికి ఊపు

image

ఖమ్మం జిల్లాలో టూరిజం ఊపందుకోనుంది. కనకగిర అడువుల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటోంది. పులిగుండాల ప్రాజెక్టులో పర్యాటకులకు బోటింగ్ సదుపాయం, అక్కడకు చేరుకునేలా ట్రెక్కింగ్ అందుబాటులో రానుంది. ఆపై వాచ్ టవర్, పక్షులను వీక్షించేందుకు ఏర్పాట్లు, సఫారీపై విహారయాత్ర అవకాశం కల్పిస్తారు. కాటేజీల నిర్మాణంతో పర్యాటకులు ఇక్కడే విడిది చేసే అవకాశం లభిస్తుంది.

Similar News

News October 8, 2024

KMM: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.శ్రీజ, శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠలతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

News October 7, 2024

కొత్తగూడెం: ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కొత్తగూడెం రుద్రంపూర్ ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 9లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆరు కొత్త కోర్సులలో సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఆగస్టు 1 నాటికి 14 సంవత్సరాలు నిండిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.

News October 7, 2024

ఖమ్మం: నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు: ట్రాఫిక్ ఏసీపీ

image

ఖమ్మంలో ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ ACP శ్రీనివాసులు తెలిపారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో వాహన తనిఖీల్లో భాగంగా నంబర్ ప్లేట్ లేని 55 బైకులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం పట్టుబడిన వాహన పత్రాలు, ఛాసిస్ నంబర్లు తనిఖీ చేస్తూ చోరికి గురైన వాహనాలు ఏమైనా ఉన్నాయో లేదో పరిశీలిస్తునట్లు పేర్కొన్నారు.